NTV Telugu Site icon

కోహ్లీ వ్యాఖ్యలపై స్పందించిన బీసీసీఐ…!

కోహ్లీ వ్యాఖ్యలపై బీసీసీఐ స్పందించింది. టీ-20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని సెప్టెంబర్‌లో కోహ్లీ చెప్పారు. అప్పుడే వద్దని కోహ్లీకి చెప్పాం. మేము స్పందచలేదని చెప్పడం అవాస్తవం అని బీసీసీఐ తెలిపింది. టీ-20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే మరో కెప్టెన్‌ను నియమించాల్సి ఉంటుంది. అప్పుడు వన్డేలకు ఒకరు, టీ-20లకు మరొకరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాల్సి వస్తుంది. అది బీసీసీఐకి సమస్యగా మారుతుందని కోహ్లీతో చెప్పాం. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోమని గంట ముందు చెప్పామన్నది అవాస్తవం. వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటారని గంగూలీ నేరుగా కోహ్లీతో చెప్పారు అని బీసీసీఐ పేర్కొంది.

అయితే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు కోహ్లీకి ముందే చెప్పామని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పగా.. కేవలం గంటన్నర ముందు మాత్రమే దీనిపై తనకు సమాచారం ఇచ్చారన్నారు విరాట్‌. అలాగే తాను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా బీసీసీఐ అధికారులకు సమాచారం ఇచ్చానన్నాడు విరాట్‌. వారి నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదన్నాడు.