ఈరోజు ఐపీఎల్ 2021 లో జరుగుతున్న రెండో మాస్క్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. జట్టు ఓపెనర్ దేవదత్ పాడిక్కల్ డక్ ఔట్ గా వెనుదిరిగిన మరో ఓపెనర్ కోహ్లీ(51) అర్ధశతకంతో రాణించాడు. అలాగే కీపర్ శ్రీకర్ భరత్(32) పరుగులు చేయగా గ్లెన్ మాక్స్‌వెల్(56) కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కానీ ఆ తర్వాత పరుగుల వేగం కాస్త తగ్గడంతో ఆర్సీబీ 165 పరుగుల వద్దే తమ ఇన్నింగ్స్ ను ముగించింది. ఇక ముంబై బౌలర్లలో పేసర్ బుమ్రా మూడు వికెట్లు తీయగా ఆడమ్ మిల్నే, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ ఒక్కో వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే డిఫెండింగ్ ఛాంపియన్స్ 166 పరుగులు చేయాలి. అయితే ముంబై జట్టులో ఉన్న భారీ హీటర్లు ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ హీటర్లను బెంగళూర్ బౌలర్లు ఆపగలరా.. లేదా అనేది చూడాలి.