కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 యూఏఈ వేదికగా నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. దాంతో కేకేఆర్ ముందు 100 పరుగుల లోపే లక్షాన్ని ఉంచింది. ఆర్సీబీ జట్టులో 22 తో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా దేవదత్ పడిక్కల్ నిలిచాడు. కోహ్లీతో సహా మిగితా ఆటగాళ్లు అందరూ కనీస పరుగులు చేయలేకపోయారు. దాంతో బెంగళూర్ జట్టు 92 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. ఇక కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్ 3 వికెట్లు, లాకీ ఫెర్గూసన్ 2 వికెట్లు తీయగా ప్రసిద్ కృష్ణ ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే కోల్‌కతా 93 పరుగులు చేయాలి. చూడాలి మరి ఆర్సీబీ బౌలర్లు ఈ స్వల్ప లక్ష్యాన్ని కాపాడగలరా.. లేదా అనేది.