NTV Telugu Site icon

ముగిసిన బీఏసీ స‌మావేశం… అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు స‌మావేశాలు…

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమ‌య్యాయి.  ఈ ఉద‌యం 11 గంట‌ల‌కు స‌మావేశాలు ప్రారంభం కాగా, స‌భ‌లో స్పీక‌ర్ సంతాప తీర్మానాలు ప్ర‌వేశ‌పెట్టారు.  అనంత‌రం స‌భ‌ను వాయిదా వేశారు.  స‌భ వాయిదా వేసిన త‌రువాత బీఏసీ స‌మావేశం జ‌రిగింది.  ఈ స‌మావేశంలో స‌భ‌లో చ‌ర్చించే అంశాల‌పై నిర్ణ‌యం తీసుకున్నారు. స‌భ‌లో చ‌ర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయ‌ని, త‌ప్ప‌నిస‌రిగా 20 రోజులు స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.  అయితే, అక్టోబ‌ర్ 5 వ‌ర‌కు అసెంబ్లీ స‌మావేశాల‌ను ప్ర‌భుత్వం షెడ్యూల్ చేసింది.  స‌మావేశాలు 10 రోజులు పాటు నిర్వ‌హించ‌డం వ‌ల‌న అన్ని అంశాల‌పై చ‌ర్చించ‌డానికి కుద‌రద‌ని, కావాల‌నే ప్ర‌భుత్వం అసెంబ్లీ సమావేశాల‌ను త‌క్కువ రోజులు నిర్వ‌హిస్తోందని కాంగ్రెస్ పార్టీ మండిప‌డింది. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై స‌భ‌లో ప‌ట్టుబ‌డ‌తామ‌ని కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న‌ది.  

Read: దుగ్గిరాల ఎంపీపీపై పెరుగుతున్న ఉత్కంఠ‌త‌…