దారుణం.. నలుగురిని బలితీసుకున్న ఆన్‌లైన్‌ గేమ్స్..

ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఓ కుటుంబాన్ని బలితీసుకుంది.. మొబైల్ గేమ్‌లలో పిల్లలే కాదు.. పెద్దలు కూడా మునిగిపోయి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. కొందరు ప్రాణాలే తీసుకున్న ఘటనలు ఉన్నాయి.. తాజాగా, ఓ కుటుంబాన్ని మొత్తం బలితీసుకున్నాయి ఆన్‌లైన్‌ గేమ్స్‌.. చెన్నైలో జరిగిన ఆ దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Read Also: బండి సంజయ్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసులు..!

ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసై, పనికి కూడా వెళ్లకుండా, అప్పుల పాలయ్యాడో వ్యక్తి.. పెరుంగుడి పెరియార్‌లోని ఓ అపార్టుమెంట్‌లో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు మణికంఠన్‌ అనే వ్యక్తి.. కోయంబత్తూర్‌కు చెందిన ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు.. అయితే, రెండు నెలలుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు.. ఆన్‌లైన్‌లో నగదు పెట్టి గేమ్‌లు ఆడుతూ అప్పులపాలయ్యాడని పోలీసులు చెబుతున్నారు.. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు కూడా జరిగేవి.. ఈ క్రమంలో భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన మణికంఠన్.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తంగా.. ఆన్‌లైన్‌ గేమ్స్‌ అప్పులపాలుచేసి.. మణికంఠన్‌ (36), తార (35), ధరణ్‌ (10), దహాన్‌ (1) ప్రాణాలు తీశాయి.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Latest Articles