పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ రోజు పాటియాలా సెంట్రల్ జైలు నుండి విడుదల అవుతున్నారు. 34 ఏళ్ల క్రితం ఒక వ్యక్తిని హత్య కేసులో సిద్ధూను సుప్రీంకోర్టు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. ఈ కేసులో సిద్దూకి ఏడాది జైలు శిక్షను కోర్టు విధించింది. అయితే, జైల్లో ఆయన సత్ప్రవర్తన కారణంగా ముందుగా 10 నెలల్లోనే విడుదలవుతున్నారు.
Also Read: US NATO Ambassador : నాటోలో భారత్ కు చోటు..? యూఎస్ నాటో రాయబారి షాకింగ్ కామెంట్స్
రాష్ట్ర ఎన్నికలలో పార్టీ ఓటమి తర్వాత పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన నవజ్యోత్ సింగ్ సిద్ధూను సుప్రీంకోర్టు గత ఏడాది మేలో ఒక సంవత్సరం కఠినమైన జైలు శిక్ష విధించింది. దీని ప్రకారం ఆయన ఈ ఏడాది మే నెలలో విడుదల కావాల్సి ఉంది. అయితే, పంజాబ్ జైలు నిబంధనల ప్రకారం సత్ప్రవర్తన కలిగిన దోషి సాధారణ ఉపశమనం పొందేందుకు అర్హులు. దీంతో సిద్ధూ పాటియాలా జైలు నుండి శనివారం విడుదల అవుతున్నారు. జైలు నుంచి సిద్దూ విడుదల కానున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read: MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్న కవిత.. ప్రసంగంపై ఉత్కంఠ
కాగా, డిసెంబర్ 27, 1988న, పాటియాలా నివాసి అయిన 65 ఏళ్ల గుర్నామ్ సింగ్‌తో పార్కింగ్ స్థలం విషయంలో సిద్ధూ వాగ్వాదానికి దిగాడు. మిస్టర్ సిద్ధూ మరియు అతని స్నేహితుడు రూపిందర్ సింగ్ సంధు, గుర్నామ్ సింగ్‌ను అతని కారు నుండి బయటకు లాగి కొట్టారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిద్ధూ గుర్నామ్‌సింగ్‌ను తలపై దెబ్బతో హత్య చేశారని ప్రత్యక్ష సాక్షి ఆరోపించారు. సిద్ధూ, అతని స్నేహితుడితో ఘర్షణ తర్వాత మరణించిన వ్యక్తి కుటుంబం చేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పు వచ్చింది. హత్యా నేరం నుండి విముక్తిని ప్రకటిస్తూ సుప్రీం కోర్టు 2018లో ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని, కఠిన శిక్ష విధించాలని ఆ కుటుంబం కోరింది. గత ఏడాది మేలో సిద్ధూని దోషిగా సుప్రీం కోర్టు నిర్ధారించింది. ఆయన ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అప్పటి నుంచి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.