Site icon NTV Telugu

వినోదం ఆశించే ప్రేక్షకులపై ఆంక్షలు సమంజసమా?

ఏపీలో టిక్కెట్ల రేట్ల వ్యవహారం, బెనిఫిట్ షోలను రద్దు చేయడం వంటి అంశాలు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. పెద్ద హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు ప్రదర్శించడం ఎన్నాళ్ల నుంచో ఆనవాయితీగా వస్తున్న వ్యవహారం. అయితే ప్రస్తుతం ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు చేయడంపై పలు హీరోల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ లేనిది కొత్తగా సినిమాలపై ఆంక్షలు విధించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: రివ్యూ: పుష్ప

ఏపీ ప్రభుత్వం తాజాగా సినిమా టిక్కెట్ల రేట్లపై ఓ నిర్ణయం తీసుకోవడం ఓ వర్గం వారిని సంతోషపరిచింది. ఎందుకంటే పెద్ద సినిమాలు విడుదలైన సమయంలో ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేసి కొందరు సామాన్యులను దోచుకుంటున్నారని ప్రభుత్వం భావించి టిక్కెట్ రేట్లపై జీవో తెచ్చింది. ఈ నిర్ణయం సామాన్య ప్రేక్షకుడికి ఊరట కలిగించేదే. కానీ బెనిఫిట్ షో అనేది ప్రేక్షకులకు వినోదాన్ని అందించేది. తమ హీరో సినిమాను ఫస్డ్ డే ఫస్ట్ షో చూడాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు.

Read Also: ‘పుష్ప’ సెకండ్ పార్ట్ టైటిల్ లీక్..!!

అయితే పక్క రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తున్నప్పుడు ఏపీలో ఎందుకు ప్రదర్శించరనేదే ఇక్కడ వివాదాస్పదం అవుతోంది. ఎందుకంటే ఏపీలో రెగ్యులర్ షో ప్రదర్శించే సమయానికి పక్క రాష్ట్రంలో బెనిఫిట్ షో వల్ల టాక్ ముందే వచ్చేస్తుంది. అప్పుడు అభిమానులకు కిక్ ఎలా వస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షోలు లేకపోవడంతో ఫస్ట్ డే ఫస్ట్ షోకు వచ్చే ఫీలింగ్ తమకు రావడం లేదని.. అయినా తమకు ఇష్టం ఉంటే బెనిఫిట్ షోకు ఎక్కువ డబ్బులు పెట్టి వెళ్తామని.. ఈ విషయంలో తమను నియంత్రించడం సబబుగా లేదని పలువురు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు.

Read Also: హిందూపురంలో బన్నీ అభిమానుల రచ్చ.. థియేటర్‌పై రాళ్లు

అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా కోసం అనంతపురం జిల్లా హిందూపురంలో అభిమానులు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. బెనిఫిట్ షోలు ఎందుకు రద్దు చేశారో చెప్పాలని సినిమా ప్రదర్శిస్తున్న బాలాజీ థియేటర్‌పై రాళ్లు విసిరారు. వినోదం ఆశించే ప్రేక్షకులపై ఆంక్షలు విధించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా టిక్కెట్ల రేట్ల విషయంలో సర్కారు తీసుకున్న నిర్ణయం ఎలా ఉన్నా… బెనిఫిట్ షోలను రద్దు చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version