NTV Telugu Site icon

Apple CEO: ప్రధాని మోడీని కలిసిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్

Modi And Apple Ceo

Modi And Apple Ceo

భారత్ లో పర్యటిస్తున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీని కలిసారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఫస్ట్ ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఆపిల్ యొక్క రెండవ స్టోర్ ప్రారంభానికి ముందు ప్రధాని మోడీతో యాపిల్ సీఈఓ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విద్య, డెవలపర్‌ల నుండి తయారీ వరకు వివిధ అంశాలపై చర్చించారు. అభిప్రాయాలను పంచుకున్నారు. దేశమంతటా అభివృద్ధి కోసం యాపిల్ కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉందని సమావేశం అనంతరం యాపిల్ సీఈఓ కుక్ తెలిపారు. భారతదేశ భవిష్యత్తుపై సాంకేతికత సానుకూల ప్రభావం చూపుతుందని తాము ఇందులో భాగస్వామ్యం అవుతామని తెలిపారు. దేశవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నామని నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రధానితో భేటీకి ముందు యాపిల్ సీఈవో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు.
Also Read:Minister Jadish Reddy : కాంగ్రెస్ దిక్కు దివానా లేని పార్టీ

కాగా, టిమ్ కుక్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో భారతదేశంలో Apple యొక్క మొట్టమొదటి అధికారిక రిటైల్ స్టోర్‌ను ప్రారంభించారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ డ్రైవ్‌లో తెరిచిన ఆపిల్ స్టోర్ కంటే సాకేత్ స్టోర్ చిన్నది. ముంబైలో ఆపిల్ యొక్క మొట్టమొదటి ఇండియా స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్ మాదిరిగానే.. రేపు సాకేత్ యొక్క సెలెక్ట్ సిటీ మాల్‌లో స్టోర్ ప్రారంభోత్సవంలో టిమ్ కుక్ కస్టమర్‌లను స్వాగతించనున్నారు.