Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Govt Alert On Jawad Cyclone Ndrf Teams Deployed

జవాద్ తుఫాన్‌పై అప్రమత్తం ..రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌

Published Date :December 3, 2021 , 4:30 pm
By NTV WebDesk
జవాద్ తుఫాన్‌పై అప్రమత్తం ..రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం జవాద్​తుఫానుగా మారిన సంగతి తెలిసిందే. జవాద్ తుఫాన్ ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ఒడిశాలోని గోపాల్ పూర్ కు 530 కిలోమీటర్లు, పారాదీప్ కు 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.క్రమంగా ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి ఉత్తర కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముంది.

అనంతరం తీరాన్ని ఆనుకుని కదులుతూ దిశమార్చుకుని ఒడిశాలోని పూరీ వైపుగా మరలే సూచనలు ఉన్నాయి.ప్రస్తుతం ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర కోస్తాంధ్రవైపు కదులుతోంది.ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే కొద్దీ తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా పెరుగుతుంది.ఉత్తర కోస్తా తీరప్రాంతాల్లో గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్టెల్లా చెప్పారు.

ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు వున్నాయని హెచ్చరించారు. చాలా చోట్ల 20 సెంటిమీటర్లకు పైగా అధిక వర్షపాతం నమోదు అయ్యే సూచనలు ఉన్నాయి. తుఫాను ప్రభావంతో సముద్రపు అలలు 3.5 మీటర్ల ఎత్తున ఎగసిపడే ప్రమాదముంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాం.

ఉత్తర కోస్తాంధ్రలోని అన్ని పోర్టులకూ హెచ్చరికలు జారీ అయ్యాయి.తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ వివరించారు. తుఫాన్ దృష్ట్యా శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. ముంపు గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. తుఫాన్ ప్రభావం ఉన్న ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి అంటూ సూచనలు చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bay of Bengal
  • imd amaravati
  • Jawad Cyclone effect
  • NDRF
  • rains

తాజావార్తలు

  • Hardik Pandya: ఆ ఆట, షాట్స్ చూసి ఆశ్చర్యపోయా.. వైభవ్‌ సూర్యవంశీకి అంతా మంచే జరగాలి!

  • Tollywood: సమ్మర్‌ అంటే ఎందుకంత భయం?

  • The Original Hitman: అప్పట్లోనే ఒకడు ఉండేవాడు.. 500 సిక్సర్లతో రోహిత్‌శర్మను మించిన హిట్‌మ్యాన్ ఇతను!

  • LPG Gas: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై మరో బిగ్ అప్‌డేట్..

  • Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..

ట్రెండింగ్‌

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions