ఓటీఎస్ పథకం విషయంలో ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు.. ముఖ్యంగా టీడీపీ ఈ విషయంలో వైసీపీ సర్కార్‌ను నిలదీస్తోంది… అయితే, విపక్షాలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు సీఎం వైఎస్ జగన్.. ఓటీఎస్ పథకం, గృహ నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా.. ఓటీఎస్ పథకం పై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.. ఓటీఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి.. ఓటీఎస్ అన్నది పూర్తి స్వచ్ఛందం.. క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ జరుగుతుంది.. రూ.10వేల కోట్ల రూపాయల భారాన్ని పేదలపై తొలగిస్తున్నాం.. వారి రుణాలు మాఫీచేస్తున్నాం, రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా చేస్తున్నాం.. వారికి సంపూర్ణ హక్కులు వస్తాయని స్పష్టం చేశారు.. వీటిపై ప్రజలకు అవగాహన తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్.
Read Also: పొంచిఉన్న ముప్పు.. ఒమిక్రాన్‌ను లైట్ తీసుకోవద్దు..!
ఇక, ఓటీఎస్ పథకం అమలు కాకుండా చాలామంది చాలా రకాలుగా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు సీఎం వైఎస్ జగన్.. గతంలో వడ్డీ మాఫీ చేయాలన్న ప్రతిపాదలనూ గత ప్రభుత్వం పరిశీలించలేదన్న ఆయన.. సుమారు 43 వేల మంది గత ప్రభుత్వ హయాంలో అసలు, వడ్డీకూడా కట్టారని.. ఇవాళ మాట్లాడుతున్నవారు… అప్పుడు ఎందుకు కట్టించున్నారు? అని నిలదీశారు.. అసలు, వడ్డీ కడితేనే బీ–ఫారం పట్టా మాత్రమే ఇచ్చేవారు.. ఇప్పుడు ఓటీఎస్ పథకం ద్వారా అన్నిరకాలుగా సంపూర్ణహక్కులు ఇస్తున్నామని గుర్తుచేశారు సీఎం జగన్.. అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చు, అమ్ముకునే హక్కుకూడా ఉంటుంది.. పేదలకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నామన్న ఆయన.. ఆ అవకాశాలను వాడుకోవాలా? లేదా? అన్నది వారి ఇష్టం.. డిసెంబర్ 21 నుంచే రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడం మొదలుపెట్టండి అని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో కట్టిన 43వేల మందికి కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని ప్రకటించిన ఏపీ సీఎం.. వారికీ సంపూర్ణ హక్కులు కల్పిస్తూ మేలు చేస్తాం అన్నారు.. భవిష్యత్తులో గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ పనులు కూడా జరుగుతాయన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.