NTV Telugu Site icon

Budget Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 17న రాష్ట్ర బడ్జెట్!

Ap Budget

Ap Budget

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌నజీర్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఉభయసభలూ మరుసటి రోజుకు వాయిదా పడనున్నాయి. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. ఈ నెల 24 వరకు సభను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మధ్యాహ్నం సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులను కేబినెట్ లో ఆమోదిస్తారు.
Also Read:Jansena: నేడు జనసేన ఆవిర్భావ సభ… ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న పవన్

ఈ నెల 17 లేదా 18న సభలో 2023-2024 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్ రూ. 2లక్షల 60 వేల కోట్లకు పైగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా సంక్షేమంతో పాటు విద్యా, వైద్య, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన చేస్తోంది. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉండటంతో ఇదే పూర్తి స్థాయి బడ్జెట్‌. ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్నందున వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ కావడంతో సంక్షేమ పథకాలకు మరిన్ని బడ్జెట్‌ కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. విశాఖపట్నంలో జరగనున్న జి-20 కార్యవర్గ కమిటీ సమావేశం దృష్ట్యా ప్రభుత్వం మార్చి 28 లోపు బడ్జెట్ సెషన్‌ను ముగించే అవకాశం ఉంది.
Also Read:Instagram Cheating: బంపర్ ఆఫర్.. మూడు రోజుల్లో మూడు రెట్ల వడ్డీ

ఈ సమావేశాల్లో సీఎం జగన్‌ పలు అంశాలపై కీలక ప్రకటనలు చేయనున్నారు.విశాఖ నుంచి పాలన ప్రారంభించడంపైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నాలుగేళ్ల పాలనతో పాటు మూడు రాజధానులు, సంక్షేమం, వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు వంటి ముఖ్యమైన అంశాల ఎజెండాతో సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది.

మరోవైపు ప్రజా సమస్యలపై ఉభయసభల్లో చర్చకు పట్టుపట్టాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిర్ణయించింది. విద్యుత్‌ ఛార్జీల పెంపు, పోలవరం, రైతుల సమస్యలు, నిరుద్యోగం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్.లోకేశ్ హాజరుకాకపోవచ్చని సమాచారం. MLC పదవీకాలం మార్చి 28న ముగియనుండడంతో బడ్జెట్ సెషన్ ఆయనకు చివరిది. 4,000 కిలోమీటర్ల యువగళం పాదయాత్రలో ఉన్నందున లోకేష్ హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీకి హాజరు కాబోనని గతంలో చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు.