హైదరాబాద్‌లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. నగర శివారులో మైనర్ బాలికపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. కాచిగూడ ప్రాంతానికి చెందిన ఓ బాలిక కోఠిలోని ఓ కాలేజీలో చదువుకుంటుంది.. నాలుగు రోజుల క్రితం బాలిక తనకు తెలిసిన ఆటోలో కాలేజీకి బయల్దేరింది.. అయితే, కళాశాలకు వెళ్తున్న బాలికకు మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్.. శివారులోని మేడిపల్లికి తీసుకొని వెళ్లాడు.. మేడిపల్లిలో 4 రోజుల పాటు రోజు ఒకో ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు ఆటో డ్రైవర్లు.. మొత్తం ఐదుగురు ఆటో డ్రైవర్లు బాలికపైబడి తమ కామవాంఛ తీర్చుకున్నారని పోలీసులు చెబుతున్నారు..
Read Also: ఓటీఎస్‌పై విమర్శలు.. సీఎం జగన్ కౌంటర్ ఎటాక్
మరోవైపు రాత్రి అవుతున్నా కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజీకి వెళ్లిన తమ కూతురు ఇంటికి తిరిగిరాలేదంటూ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, మిక్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టగా.. ఇక, నాలుగు రోజుల తర్వాత బాలికను చాదర్‌ఘాట్ ప్రాంతంలో వదిలి వెళ్లిపోయారు.. అతి కష్టంమీద ఇంటికి చేరుకున్న బాలిక.. తనపై ఆటో డ్రైవర్లు చేసిన అఘాయిత్యాన్ని కుటుంబసభ్యులకు చెప్పి కన్నీరుమున్నీరైంది.. ఇక, బాలిక చెప్పిన వివరాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాలికపై వేరువేరు ప్రాంతాల్లో అత్యాచారం చేసిన ఐదుగురు ఆటోడ్రైవర్లను అరెస్ట్ చేశారు.. నిందితులపై పోక్సో చట్టం , అత్యాచార కేసులు నమోదు చేశారు.. ఐదుగురు ఆటో డ్రైవర్లను రిమాండ్‌కు తరలించారు పోలీసులు.
