ఎప్పుడు ఎవరు ఎలా సక్సెస్ అవుతారో చెప్పలేం. చిన్నగా ప్రారంభమైన వ్యాపారం ఆ తరువాత విస్తరించి అతిపెద్ద సామ్రాజ్యంగా మారడం సహజమే. దానికి ఓపిక ఉండాలి. సహనంలో పనిచేయాలి. నమ్మకంతో ఆకట్టుకునే విధంగా వ్యవహరించాలి. కొన్నేళ్ల క్రితం బ్రిటన్‌లో ఓ బిడ్డకు తల్లైన అన్నాబెల్ మార్గిన్నిస్ అనే మహిళ తన ఇంటి నుంచి ఓ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇంట్లోని వంట గదిలో మహిళలకు నెయిల్ పాలిష్ వేయడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల వారికి బాగా నచ్చడంతో నిత్యం అనేక మంది అన్నాబెల్ ఇంటికి వచ్చేవారు. దీంతో నామమాత్రంగా డబ్బులు తీసుకుంటూ నెయిల్ పాలిష్ చేయడం మొదలుపెట్టింది. నెయిల్ పాలిష్ బాగా ఫేమస్ కావడంతో ఇంటికి ఎక్కువ మంది కస్టమర్లు రాసాగారు.
అన్నాబెల్ నెయిల్ పాలిష్ వేస్తుంటే ఆమె తల్లి కస్టమర్లకు షాంపెయిన్ సర్వ్ చేస్తుండేది. వ్యాపారం మంచిగా సాగుతుండటంతో స్టాపర్డ్ షైర్‌లో బ్రిటన్ గర్లియస్ట్ అనే సెలూన్‌ను ఓపెన్ చేసింది అన్నాబెల్. మహిళలను ఆకట్టుకునే విధంగా సెలూన్‌ను పింక్ రంగులతో నింపేసింది. సెలూల్ ను భూలోక స్వర్గంగా తీర్చిదిద్దారు. సెలూన్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటుగా ఎప్పటి కప్పుడు కొత్త కొత్త రంగులు, కొత్త కొత్తగా నెయిల్ పాలిష్ పెయింటింగ్స్‌ను వేస్తుండటంతో ఆదరణ పెరిగింది. ఒకప్పుడు చిన్నగా ప్రారంభమైన ఈ వ్యాపారం ఇప్పుడు బిలియన్ డాలర్లకు చేరుకుంది. బ్రిటన్‌లో బ్రిటన్ గర్లియస్ట్ సెలూన్ అంటే తెలియని వ్యక్తులు ఉండరు.
Read: “సర్కారు వారి పాట”లో ఎవరెవరు ఏఏ పాత్రలు చేస్తున్నారంటే ?