NTV Telugu Site icon

Ajith Antony : బీజేపీలో అనిల్ కరివేపాకు.. పార్టీ నుంచి గెంటేస్తారు..

Ajit Antoy

Ajit Antoy

బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీపై ఆయన సోదరుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడి నిర్ణయం షాక్ కు గురి చేసిందని ఎకె ఆంటోనీ చిన్న కుమారుడు అజిత్ అన్నారు. కాషాయ పార్టీ అతన్ని తాత్కాలికంగా ఉపయోగించుకున్న తర్వాత కరివేపాకు లాగా విసిరివేస్తుందని అన్నారు. అనిల్ ఆంటోనీ తన నిర్ణయం గురించి కుటుంబానికి కనీస సూచన ఇవ్వలేదని తెలిపారు. మీడియాలో వచ్చిన వార్తలను చూసిన తమ కుటుంబ సభ్యులు అవాక్కయ్యారని అజిత్ ఆంటోని చెప్పారు.
Also Read:Manish Sisodia: ప్రధాని మోడీకి తక్కువ అర్హతలు.. దేశానికి ప్రమాదకరం

అనిల్ ఆంటోనీ బీజేపీ సభ్యత్వాన్ని స్వీకరించడాన్ని చూసిన తర్వాత తన తండ్రి చాలా కృంగిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి ఇంట్లో ఒక మూలన కూర్చొని చాలా బాధ పడ్డారని తెలిపారు. తన జీవితంలో ఆయనను ఇంత బలహీనంగా ఎప్పుడూ చూడలేదన్నారు. ఆయన కన్నీళ్లు పెట్టుకోలేదు, అంతే అని అజిత్ ఆంటోని అన్నారు. తన సోదరుడు బీజేపీలో చేరడానికి తన సొంత కారణాలు ఉంటాయన్నారు. గుర్తు తెలియని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి తనకు చాలాసార్లు అసభ్యకరమైన కాల్స్ వస్తున్నాయని, అది తనను బాధించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
Also Read:Karnataka polls: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో యశ్‌.. కేజీఎఫ్ హీరో కోసం ఆఫర్లు

కోపంతో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటారని అనుకున్నాను కానీ, బీజేపీలోకి వెళ్తారని ఎప్పుడూ అనుకోలేదన్నారు. అనిల్ పూర్తిగా ఊహించని నిర్ణయం తీసుకున్నారని ఆయన తమ్ముడు అజిత్ చెప్పాడు.బీజేపీలో చేరాలని అనిల్ తీసుకున్న నిర్ణయాన్ని చాలా ఉద్రేకపూరితమైనది అని పేర్కొన్న అజిత్ ఆంటోనీ, తన తప్పులను సరిదిద్దుకుని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని తాను నమ్ముతున్నానని అన్నారు. తన రాజకీయ భవిష్యత్తుకు మంచిదని భావిస్తే బీజేపీలోనే కొనసాగవచ్చని అజిత్ ఆంటోని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తనకి మేలు జరుగుతుందని భావించి అతను బహుశా వెళ్ళి ఉండవచ్చు. కానీ, వాళ్లు (బీజేపీ) ఆయన్ను కరివేపాకులా తరిమికొడతారని పదే పదే చెబుతానుఅని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read:Salman Khan: ప్రమోషన్స్ మొదలుపెట్టిన భాయ్ జాన్…

కొన్నేళ్ల క్రితం బీజేపీలో చేరిన అల్ఫోన్స్‌ కన్నంతనం, టామ్‌ వడక్కన్‌ వంటి నేతలను ఉదాహరణగా చూపుతూ అజిత్‌ ఆంటోనీ మాట్లాడుతూ.. బీజేపీ అందరినీ తాత్కాలికంగా వాడుకుని, వాడిన కరివేపాకులా తరిమికొడుతుందని అన్నారు. కాగా, అనిల్ ఆంటోనీ గురువారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, వీ మురళీధరన్ సమక్షంలో బీజేపీలో చేరారు. భావోద్వేగానికి లోనైన ఎకె ఆంటోనీ అనిల్ ది తప్పుడు నిర్ణయం అని చెప్పిన సంగతి తెలిసిందే. తాను చచ్చే వరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.