కేరళలోని సహకార బ్యాంకుల్లో జరిగిన కుంభకోణాలపై పినరయి విజయన్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ కార్యదర్శి అనిల్ ఆంటోనీ బుధవారం విమర్శలు గుప్పించారు. తీవ్రమైన బ్యాంకింగ్ అక్రమాలు, కుంభకోణాల కారణంగా సామాన్యుల జీవితాల పొదుపు ప్రమాదంలో పడుతుందని ఆంటోనీ అన్నారు.
బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీపై ఆయన సోదరుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడి నిర్ణయం షాక్ కు గురి చేసిందని ఎకె ఆంటోనీ చిన్న కుమారుడు అజిత్ అన్నారు. కాషాయ పార్టీ అతన్ని తాత్కాలికంగా ఉపయోగించుకున్న తర్వాత కరివేపాకు లాగా విసిరివేస్తుందని అన్నారు.
తన కుమారుడు అనిల్ బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ స్పందించారు. అతడి నిర్ణయం తప్పని.. ఈ క్షణం తనను తీవ్రంగా బాధించిందని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ గురువారం బీజేపీలో చేరారు. బీజేపీ నేతలు పీయూష్ గోయల్, వి మురళీధరన్, బిజెపి కేరళ రాష్ట్ర చీఫ్ కె సురేంద్రన్ సమక్షంలో అనిల్ ఆంటోనీ బీజేపీలో చేరారు.
Congress’s AK Antony’s Son Quits Party: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని పార్టీకి గుడ్ బై చెప్పారు. బుధవారం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీకి పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ఈ రాజీనామాకు కారణం అయింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ను ఉపసంహరించుకోవాలని…