వరద బాధితుల కోసం జోలె పట్టాలని ఏపీ బీజేపీ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో భారీ వర్షాల కారణంగా రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితుల సహాయార్థం జోలె పట్టి విరాళాలను సేకరించాలని పార్టీ శ్రేణులకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు పిలుపునిచ్చారు. వరద ప్రభావిత జిల్లాలలో బాధితులను ఆదుకునేందుకు ఈనెల 25, 26 తేదీల్లో విరాళాల సేకరణకు కార్యాచరణ రూపొందించినట్లు సోము వీర్రాజు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలను సేకరిస్తామని, ప్రజలు నగదు, వస్తు రూపంలో విరాళాలను అందజేయవచ్చని సూచించారు. ఇలా వసూలు చేసిన విరాళాలను వరద బాధితులకు అందిస్తామన్నారు. కాగా విరాళాల సేకరణ కార్యక్రమం కారణంగా ఈ నెల 26న జరగాల్సిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీని వాయిదా వేసినట్లు సోము వీర్రాజు తెలిపారు.
Read Also: పన్ను వాటాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
Also Read
- Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
- Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
- Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
- Central Cabinet Decisions: దక్షిణాదిలో కీలక రైలు మార్గానికి గ్రీన్‌సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే..!
కాగా ఏపీలో భారీ వర్షాల కారణంగా ప్రజలు పడుతున్న అవస్థలపై ఏపీ బీజేపీ నేతలే కాకుండా తెలంగాణ బీజేపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ సీనియర్ నేత విజయశాంతి స్పందించారు. ఎడతెగని వర్షాలతో కన్నీటి కడలిలా మారిన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజల అగచాట్లు చూస్తుంటే తన గుండె బరువెక్కుతోందన్నారు. పిల్లాపాపల బేల చూపుల మధ్య… ఏం చెయ్యాలో దిక్కుతోచక స్తంభించిపోయిన ఆ జీవితాలు ఎప్పటికి తేరుకుంటాయో అర్థంకాని పరిస్థితి నెలకొందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : హైదరాబాద్ ట్రాఫిక్‌కు బిగ్ ప్లాన్.. ప్రత్యేక బ్యూరో ఏర్పాటు!
-
Prabhas: ప్రభాస్ ఇటలీ విల్లా రెంట్ ఎంతో చెప్పిన ప్రభాస్ శ్రీను!
-
Prabhas Srinu: “నా ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.10 వేలు.. అత్యధికంగా రెండు రోజులకు రూ.3 లక్షలు అందుకున్నా”
-
Maruti Suzuki Brezza Facelift: మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. కొత్త ఇంజన్, 5- స్టార్ సేఫ్టీ, ధర రూ. 7.39 లక్షల నుంచి స్టార్ట్..
-
Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!