పన్ను వాటాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల పన్న వాటాలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ..3,847.96 కోట్లు విడుదల కాగా, తెలంగాణకు రూ.1,998.62 కోట్లను ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం రెండు విడతల పన్ను వాటాను 28 రాష్ట్రాలకు రూ.95,082 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

నవంబర్‌ 15న జరిగిన ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెప్టినెంట్‌ గవర్నర్ల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇచ్చిన హామీ ప్రకారం రెండు విడతలుగా పన్ను వాటాను రాష్ర్టాలకు విడుదల చేశారు. సాధారణం గా నెలవారీ పన్ను వాటా రూ.47,541 కోట్లు విడుదల చేసే కేంద్రం. ఈసారి, రెండు నెలల వాటాను కలిపి ఒకేసారి రూ.95,082 కోట్లును విడుదల చేసినట్లు తెలిపిన కేంద్రం పేర్కొంది. దీన్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,847.96 కోట్లు, తెలంగాణకు రూ.1,998.62 కోట్లు విడుదల చేశారు.

Related Articles

Latest Articles