పెట్రోల్, డీజిల్ ధరలకు భయపడి వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు పరుగులు తీస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ మైలేజ్ ఇస్తున్నా ఛార్జింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. వాహనాల బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ కావాలంటే కనీసం రెండు గంటల సమయం పడుతుంది. అయితే, ఈ కష్టాలకు త్వరలోనే చెక్ పడనుంది. ఆంప్రియస్ టెక్నాలజిస్ కంపెనీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం 6 నిమిషాల వ్యవధిలోనే 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ చేసే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
Read: ఒమిక్రాన్‌ను వ్యాక్సిన్లు పూర్తిగా అడ్డుకోలేవా?
370కేవీ అవుట్‌పుట్ ఛార్జర్ ను అందుబాటులోకి తెచ్చింది. దీనిపై ఇప్పటికే మొబైల్ పవర్ సోల్యూషన్ అనే కంపెనీ పరీక్షించింది. 80 శాతం బ్యాటరీ ఛార్జింగ్ కావడానికి 6 నిమిషాల కంటే తక్కువ సమయం పట్టినట్టు నిపుణులు చెబుతున్నారు. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేయడానికి 20 నిమిషాల సమయం పట్టినట్టు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.