‘పుష్ప’ టీజర్.. ఆల్‌టైమ్ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘పుష్ప’. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ డిసెంబర్ 17న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పుష్ప సందడి మాములుగా ఉండటం లేదు. ఇప్పటికే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్, లిరికల్ సాంగ్స్, పోస్టర్స్, గెటప్స్ ఇలా ఒక్కటి అని కాకుండా ప్రతిదీ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీజర్ అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టింది.
Read Also: మరోసారి మంచి మనస్సు చాటుకున్న బర్నింగ్ స్టార్
Also Read
‘పుష్ప’ టీజర్ వీడియోకి యూ ట్యూబ్‌లో 89 మిలియన్ వ్యూస్ రావడం ఒక రికార్డ్ అయితే.. 2 మిలియన్‌లకు పైగా లైక్స్ రావడం విశేషం. ఈ స్థాయిలో లైకులు వచ్చిన తొలి తెలుగు టీజర్‌గా ‘పుష్ప ది రైజ్’ నిలిచింది. దీంతో బన్నీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరోవైపు ఈ టీజర్‌కు 466K కామెంట్స్ వచ్చాయంటే ఈ సినిమా మీద తెలుగు ప్రేక్షకులలో ఎంతగా చర్చ జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. సినిమా విడుదల కాకుండానే రికార్డులు సృష్టిస్తున్న పుష్ప.. .విడుదలయ్యాక ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా… రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు.

తాజావార్తలు
-
Team India: టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం.. అప్పుడే ఒక వికెట్ డౌన్!
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
-
PM Modi: “నీట్ పేపర్ లీక్ ‘ఘోర పాపం’.. కఠిన శిక్ష తప్పదు”.. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Maruthi Next : మారుతీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్.. అవసరమా అధ్యక్ష్యా?
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?