మరోసారి మంచి మనస్సు చాటుకున్న బర్నింగ్ స్టార్

టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మంగళవారం రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించాడు. సంపూ నటించిన లేటెస్ట్ మూవీ ‘క్యాలీఫ్లవర్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కాకినాడ, రాజమండ్రిలో చిత్ర యూనిట్ నిర్వహించింది. దీంతో బర్నింగ్ స్టార్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అభిమానులు సంపూర్ణేష్‌కు ఘన స్వాగతం పలికారు. పలువురు అభిమానులు సంపూ ఫేస్ మాస్కులు ధరించి సర్‌ప్రైజ్ చేశారు.

Read Also: బుల్లితెరపై ఐకాన్ స్టార్ సందడి.. తగ్గేదే లే..!!

ఈ కార్యక్రమం అనంతరం శ్రీయువ సేన స్వచ్ఛంద సంస్థను హీరో సంపూర్ణేష్ సందర్శించాడు. వారు చేస్తున్న సహాయ కార్యక్రమాలకు తన వంతు ప్రోత్సాహకంగా రూ. 26వేలు నగదును విరాళంగా అందజేశాడు. దీంతో సంపూ మరోసారి తన దాతృత్వాన్ని చూపించాడని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో హుడ్‌హుడ్‌ తుఫాన్ సమయంలో, కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎంతోమందిని తన శక్తి మేరకు సంపూర్ణేష్ ఆదుకుని అందరి చేత శభాష్‌ అనిపించుకున్న సంగతి తెలిసిన విషయమే. కాగా సంపూ నటించిన ‘క్యాలీఫ్లవర్’ సినిమా ఈనెల 26న థియేటర్లలో విడుదల కానుంది.

మరోసారి మంచి మనస్సు చాటుకున్న బర్నింగ్ స్టార్

Related Articles

Latest Articles