ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ గారాలా పట్టి అల్లు అర్హ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అంతగా పాపులర్ ఈ చిన్నారి. అర్హకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తరచూ అల్లు అర్జున్, ఆయన భార్య అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.ఈ మధ్య రిలీజ్ అయిన సమంత టైటిల్ రోల్ చేసిన శాకుంతలం అనే సినిమాలో భరతుడి పాత్రలో నటించి మెప్పించారు అర్హ. ఈ చిన్నారి మరోసారి తన ప్రతిభను చూపించింది. వినాయక చవితి సందర్భంగా మట్టితో ఓ గణపతి విగ్రహాన్ని తయారు చేసింది. తన చిట్టి చేతులతో ఎంతో శ్రద్ధగా విగ్రహాన్ని తయారు చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అర్హ టాలెంటెకు బన్నీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..
గతంలో అల్లు అర్హ చెప్పిన క్యూట్ డైలాగ్స్, డ్యాన్స్ వీడియోలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూ ఉంటాయి. గత నెల రాఖీ పౌర్ణమి సందర్భంగా తన సోదరుడు అల్లు అయాన్‍కు రాఖీ కట్టారు ఆర్హ. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు అల్లు స్నేహారెడ్డి. ఇవి విపరీతంగా వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2: ది రూల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన గా నటిస్తోంది.. ఈ సినిమా మొదటి సినిమా కన్నా పవర్ ఫుల్ కథతో తెరకేక్కుతుంది.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..
ICONSTAR @alluarjun daughter preparing eco-friendly Ganesh 😍❤️#AlluArha #GaneshChaturthi #GanpatiBappaMorya pic.twitter.com/6dezHkOzXS
— Allu Babloo AADHF (@allubabloo) September 16, 2023