Site icon NTV Telugu

Akanksha Dubey: నా కూతురిది హత్యే.. నటి ఆకాంక్ష దూబే తల్లి ఆరోపణ

Akanksha

Akanksha

సంచలనం సృష్టించిన భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే మృతి కేసులో ఆమె తల్లి సంచలన విషయాలు చెప్పారు. తన కూతురిది ఆత్మహత్య కాదు హత్యేనని ఆమె చెప్పారు. 25 ఏళ్ల నటి ఆకాంక్ష దూబే మార్చి 26న వారణాసిలోని తన హోటల్ శవమై కనిపించింది. లైక్ హూన్ మై నాలైక్ నహిన్ సినిమా షూటింగ్‌లోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె హోటల్ గదిలో సూసైడ్ నోట్ దొరకలేదు. ఆకాంక్ష దూబే తల్లి మధు దూబే తన కుమార్తె మృతికి ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేసింది.
Also Read:Kishan Reddy : బంగారు తెలంగాణను పక్కకు పెట్టి… బంగారు కుటుంబం నిర్మించుకున్నారు

సమర్ సింగ్, సంజయ్ సింగ్‌లు ఆకాంక్ష హత్యకు పాల్పడ్డారని నటి తల్లి ఆరోపించింది. మార్చి 21న, సమర్ సింగ్ సోదరుడు సంజయ్ సింగ్ ఆకాంక్ష దూబేని చంపేస్తానని బెదిరించాడని, ఆ విషయాన్ని నటి స్వయంగా తనకు ఫోన్ ద్వారా తెలియజేసింది. దాంతో నిందితుడు సమర్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సమర్ సింగ్ ని ఉరితీయాలని ఆకాంక్ష తల్లి వేడుకుంది. సమర్ సింగ్ నా కుమార్తెను హింసించేవాడని ఆరోపించింది. తన కూతురు అతని దగ్గర మూడేళ్ల నుంచి పని చేస్తోందన్నారు. అయితే, చేసిన పనికి మాత్రం డబ్బులు చెల్లించలేదని తెలిపింది. తన కూతురు అతనితో కాకుండా వేరే చోట పని చేయాలనుకుందని, కానీ సమర్ ఆమెను వెళ్ళనివ్వలేదని చెప్పింది.
Also Read:Ajith Antony : బీజేపీలో అనిల్ కరివేపాకు.. పార్టీ నుంచి గెంటేస్తారు..

సమర్ తనను కొట్టే వాడని నా కూతురు ఒకసారి చెప్పింది కాబట్టి నేను ఆమెను పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని సూచించాను. అయితే, ఆమె తన ఇమేజ్ గురించి ఆందోళన చెందింది అని ఆకాంక్ష తల్లి పేర్కొంది. సమర్ కెరీర్‌లో ఆకాంక్ష సహాయపడిందని వెల్లడించింది. కానీ, అతను ఆమె జీవితాన్ని తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆకాంక్ష తన మాట విని ఆ సమయంలో ఫిర్యాదు చేసి ఉంటే, ఆమె జీవించి ఉండేదని వాపోయింది. మార్చి 23న సమర్, అతని సోదరుడు సంజయ్ తన కుమార్తెను బెదిరించారని, మరుసటి రోజు ఆమె చనిపోయిందన్నారు. అతడికి ఉరిశిక్ష వేయాలని పోలీసులకు విన్నపం చేసుకున్నారు.

Exit mobile version