కోవిడ్‌పై బూస్టర్ డోస్.. ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది.. మహమ్మారిపై విజయం సాధించడానికి భారత్‌లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. ఇప్పటికే 58,14,89,377 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశారు అధికారులు.. ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్నవారు.. ఫస్ట్ మరియు సెకండ్ డోస్ తీసుకున్నవారు సైతం ఉన్నారు. దేశవ్యాప్తంగా అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలంటే మరికొంత సమయం పడుతుంది.. అయితే, ఇప్పుడు, ఫస్ట్, సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ మాత్రమే కొనసాగుతోంది.. మరోవైపు బూస్టర్ డోస్ (మూడో డోసు)పై కూడా చర్చ సాగుతోంది. ఈ సమయంలో ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా బూస్టర్ డోస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
బూస్టర్ డోస్‌పై ప్రస్తుతం భారత్‌లో అవసరమైన డేటా లేదని స్పష్టం చేసిన డాక్టర్ గణదీప్ గులేరియా.. వచ్చే ఏడాది మొదటట్లో సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు.. యూఎస్, యూకే, ఇజ్రాయెల్ సహా అనేక దేశాలు మహమ్మారిపై పోరాడేందుకు ప్రజలకు బూస్టర్ డోసులు వేయాలని ఆలోచన చేస్తున్నాయి.. థర్డ్ డోస్‌తో అధిక రక్షణ లభిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.. ఈ నేపథ్యంలో గులేరియా మాట్లాడుతూ.. భారత్‌లో డేటా ప్రస్తుతం బూస్టర్ డోస్ అవసరమని చెప్పడానికి తమ వద్ద తగినంత డేటా ఉందని అనుకోవడం లేదన్న ఆయన.. వ్యాక్సిన్ల నుంచి ప్రజలకు కలిగే రక్షణపై పూర్తి డేటా ఉన్నప్పుడే.. దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. దీనికోసం మరిన్ని పరిశోధన అవసరమని, మరికొద్ది నెలలు సమయం పట్టే అవకాశం ఉందని.. బహుశా వచ్చే ఏడాది నాటికి బూస్టర్ డోస్ ఏంటి? అది ఎవరికి అవసరం? అనే డేటా అందుబాటులోకి వస్తుందన్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకున్నవారు మహమ్మారి నుంచి రక్షణ పొందడం చూస్తున్నాం.. ఆస్పత్రుల్లో చేరే సంఖ్య కూడా భారీగా తగ్గిందన్న గులేరియా.. ఏదో ఒక సమయంలో బూస్టర్ డోస్ కూడా అవసరం కావొచ్చు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!