NTV Telugu Site icon

Adipurush: శ్రీవారి సన్నిధిలో ఆదిపురుష్ టీమ్..సెల్ఫీల కోసం ఎగబడ్డ జనాలు..

Audupurushteam

Audupurushteam

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్.. ఈ సినిమా కోసం యావత్ సినీ లోకం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన అన్నీ కూడా భారీ అంచనాలను క్రియేట్ చేసాయి.. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 న విడుదల చెయ్యాలని చిత్రాయూనిట్ భావిస్తుంది.. ఈ సినిమా విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండటంతో సినిమా ప్రమోషన్స్ లో జోరును పెంచారు.. ఈమేరకు జూన్ 6 న తిరుపతిలో గ్రాండ్ గా ప్రీరిలిజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు..

 

ఇందులో భాగంగా ఆదిపురుష్ టీమ్ తిరుపతికి చేరుకుంది.. ఈ రోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో అంగరంగవైభవంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు..ఈ కార్యక్రమానికి చినజీయర్‌ స్వామి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ ఇప్పటికే తిరుపతికి చేరుకుంది. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం ఉదయం హీరో ప్రభాస్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.. చిత్ర టీమ్ కూడా పాల్గొన్నారు.. అనంతరం టీటీడీ అధికారులు ప్రభాస్ టీమ్ ను శాలువాతో సత్కరించి అన్న ప్రసాదాలను అందించారు..

ప్రభాస్ వచ్చారన్న విషయాన్ని తెలుసుకున్న జనం అతన్ని చూసేందుకు ఎగబడ్డారు… వైకుంఠం-1 క్యూ కాంప్లెక్స్ వద్ద, మహా ద్వారం నుంచి బయటకు వచ్చే సమయంలో భక్తులను పోలీసులు విజిలెన్స్‌ అదుపు చేయలేక పోయింది. దీంతో అతి కష్టం మీద ప్రభాస్ ను ఆలయం ముందు నుంచి రాంభాఘీచ గేట్ వరకు తీసుకొచ్చి పోలీసులు కారులో పంపించారు. అనంతరం అక్కడి నుంచి ప్రభాస్‌ గెస్ట్ హౌస్‌కి చేరుకున్నారు.. అక్కడ కూడా జనం చుట్టూ చేరుకున్నారు.. గెస్ట్ హౌజ్‌ చుట్టుపక్కల భక్తుల కోలాహలం నెలకొంది. దర్శన సమయంలో ప్రభాస్‌ వెంట టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తనయుడు ఉన్నారు. మరికాసేపట్లో తిరుపతి వెళ్లనున్న చిత్ర యూనిట్ సాయంత్రం జరగనున్న ప్రీరిలీజ్‌ ఈవెంట్లో పాల్గొననున్నారు..

Show comments