Accenture layoff: ఐటీ దిగ్గజం యాక్సెంచర్‌లో కలవరం..19 వేల మంది ఉద్యోగుల తొలగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక సంక్షోభం ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విటర్, మెటా, గూగుల్ తదితర దిగ్గజ కంపెనీలు కూడా భారీగా లేఆఫ్స్ ప్రకటించాయి. తాజాగా యాక్సెంచర్ కూడా అదే దారిలో పయనించింది. అంతర్జాతీయ స్థూల-ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వృద్ధి మందగమనం మధ్య దాదాపు 19,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గ్లోబల్ ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ గురువారం ప్రకటించింది. సగానికి పైగా తొలగింపులు దాని బిల్ చేయని కార్పొరేట్ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపై ప్రభావం చూపుతాయని కంపెనీ వెల్లడించింది. కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో 2.5 శాతం మందిపై వేటు పడింది. దాదాపు సగం మంది ఈ ఆర్థిక సంవత్సరంలో వెళ్లిపోతారని కంపెనీ చెప్పింది.
Also Read: BJP: అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం.. ఆ రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షుల నియామకం
భారతదేశంలో యాక్సెంచర్ పెద్ద ఐటీ కంపెనీ. 2023 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికానికి త్రైమాసిక ఫలితాలను అందజేస్తూ, కంపెనీ వార్షిక రాబడి వృద్ధి, లాభాల అంచనాలను కూడా తగ్గించింది.కంపెనీ ఆదాయాలు 15.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని, ఇది US డాలర్లలో 5 శాతం పెరిగిందని తెలిపింది. కొత్త బుకింగ్‌లు 13 శాతం వృద్ధితో 22.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కంపెనీ రెండవ త్రైమాసికంలో $244 మిలియన్ల వ్యాపార ఆప్టిమైజేషన్ ఖర్చులను నమోదు చేసింది. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం ఖర్చులు సుమారు $1.5 బిలియన్లను నమోదు చేయాలని భావిస్తోంది. ఖర్చులను తగ్గించడానికి తాము చర్యలు తీసుకుంటున్నామని యాక్సెంచర్ చైర్ మరియు CEO జూలీ స్వీట్ తెలిపారు.
Also Read
- PRASHAST : ప్రైవేట్ స్కూళ్లలో కొత్త స్క్రీనింగ్.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు.!
- Charminar Temple Rush: చార్మినార్‌లో పండుగ సందడి.. భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు.!
- Diwali Celebrations : అమెరికా టు కెనడా.. విదేశాల్లోనూ దీపావళి ధమాకా
- Kaziah Liz Mejo :ప్రపంచాన్ని ఏలేందుకు వెళ్తున్న కేరళ కుందెనపు బొమ్మ.. మిస్ యూనివర్స్ బరిలో 19 ఏళ్ల కజియా
తాజావార్తలు
-
Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..
-
SBI: ప్రవాసులకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఎస్బీఐ గ్రాండ్ ఎంట్రీ!
-
Polimera 3 : అనంత పద్మనాభుడి సాక్షిగా క్షుద్రపూజలు.. వేటాడేందుకు కత్తి పట్టిన యాక్షన్ కింగ్!
-
Janhvi Kapoor: ఆ సర్జరీ చేయించుకునే వరకు అమ్మ నేను హీరోయిన్గా పనికిరానంది!
-
Telangana Rice Prices : బియ్యం ధరలకు బ్రేక్.. కిలోకు గరిష్ట ధరలు ఫిక్స్.!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!