ప్రముఖ టెక్ కంపెనీ నోకియా లేఆఫ్‌లు ప్రకటించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కంపెనీ 2000 మందిని తొలగించింది. గ్రేటర్ చైనాలో నోకియా ఈ తొలగింపును చేసింది. అంతకుముందు ఖర్చులను తగ్గించుకునేందుకు యూరప్‌లో 350 మందిని కంపెనీ తొలగించింది. యూరప్‌లో ఉద్యోగుల తొలగింపులను కంపెనీ ప్రతినిధి ధృవీకరించారు.
Salesforce: ఆర్థికమాంద్యం భయాలు, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు 2022 చివరి నుంచి తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. వరసగా పలు విడతల్లో ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటిస్తున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ ఇలా ప్రముఖ కంపెనీలు లేఆఫ్ జాబితాలో ఉన్నాయి.
ఆర్థిక సంక్షోభం ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విటర్, మెటా, గూగుల్ తదితర దిగ్గజ కంపెనీలు కూడా భారీగా లేఆఫ్స్ ప్రకటించాయి.