ఏకే రావు కేసులో ట్విస్ట్.. ఆ రిపోర్ట్ కీలకంగా మారనుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సింగర్ హరిణి తండ్రి, సుజాన ఫౌండేషన్ సీఈవో ఏకే రావు మృతి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. వారం రోజులుగా కనిపించకుండపోయిన హరిణి కుటుంబ సభ్యులు.. బెంగుళూరు సమీపంలో ఓ రైల్వే ట్రాక్‌పై ఏకే రావు మృతదేహం లభ్యమయ్యాక రైల్వే పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమయ్యారు. ఏకే రావు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ముందు ఆత్మహత్య అనుకున్నా కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మర్డర్ కేసుగానే కేసు నమోదు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఏకే రావు జేబులో ఫిర్యాదు కాపీ దొరికింది. దీంతో ఆ లెటర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఎఫ్ఎస్ఎల్ కు పోలీసులు ఆ లెటర్‌ను పంపించారు. అయితే నేడు పోలీసులకు ఏకే రావు పోస్ట్ మార్టం రిపోర్ట్ అందనుంది. ఈ నేపథ్యంలో ఆ పోస్టుమార్టం రిపోర్ట్ కీలకంగా మారనుంది. సిద్దగుంట పాళీ పీఎస్ లో నమోదైన 150 కోట్ల చీటింగ్ కేసు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఏకే రావును వేధించిన వ్యక్తులపై పోలీసుల ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల స్టేట్మెంట్స్ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. దీనితో పాటు ఏకే రావు సెల్ ఫోన్స్ డేటాను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అంతేకాకుండా పలువురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు.
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్‌బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Super Splendor: హీరో నుంచి కొత్త స్ల్పెండర్ బైక్ వచ్చేసింది.. అదరిపోయిన ఫీచర్స్.. తక్కువ ధరలోనే..
-
IMD : నైరుతి రుతుపవనాలు వచ్చేసినట్టేనా..? వాతావరణ శాఖ కీలక అప్డేట్..!
-
Musical Drama : గొంతు క్యాన్సర్ తో పోరాడే రేడియో జాకీ… నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి మలయాళ ఎమోషనల్ డ్రామా
-
Telangana Congress: గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల డిష్యూం.. డిష్యూం.. చొక్కాలు పట్టుకుని మరీ..
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!