NTV Telugu Site icon

Mayor of Ballari: 23 ఏళ్లకే మేయర్ పదవి.. చరిత్ర సృష్టించిన త్రివేణి

Ballari Mayour

Ballari Mayour

బళ్లారి సిటీ కార్పొరేషన్‌కు మేయర్‌గా కాంగ్రెస్‌కు చెందిన 23 ఏళ్ల త్రివేణి ఎన్నికయ్యారు. కర్ణాటకలో అతి పిన్న వయసులో మేయర్‌గా రికార్డు సృష్టించారు. డిప్యూటీ మేయర్‌గా కాంగ్రెస్‌కు చెందిన బి. జానకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన త్రివేణి 18 ఏళ్లకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విమ్స్‌ వైద్య కళాశాలలో డిప్లొమా ఇన్‌ఫార్మసీ పూర్తి చేశారు. నాలుగో వార్డు కార్పొరేటర్‌గా ఉన్న ఆమె మేయర్‌ పీఠానికి బుధవారం జరిగిన ఓటింగ్‌లో విజయం సాధించారు.
Also Read:Kajal Aggarwal: అందం ఆమె సొంతం.. కాటుక కళ్లతో కవ్విస్తున్న కాజల్‌

మొత్తం 39 వార్డుల్లో కాంగ్రెస్‌ 26 వార్డులు, బీజేపీ 13 వార్డులు గెలుచుకున్నాయి. మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఐదుగురు స్వతంత్ర సభ్యులు మద్దతు పలికారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఓటు వేసే అవకాశం ఉంది. మేయర్ ఎన్నికల్లో 28 ఓట్లతో త్రివేణి విజేతగా నిలవగా, 39 మంది కార్పొరేటర్లు ఉన్న సభలో ఆమె ప్రత్యర్థి బీజేపీకి చెందిన నాగరాతమ్మ కేవలం 16 ఓట్లను మాత్రమే సాధించగలిగారు. ఓటర్లలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ , ఎంపీలు ఉంటారు. సభ మొత్తం బలం 44.

Also Read:Ferry Fire: ఫెర్రీలో చెలరేగిన మంటలు.. 12 మంది మృతి, ఏడుగురు మిస్సింగ్

కేవలం 13 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే 21 స్థానాల్లో ఉన్న కాంగ్రెస్‌కు ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు మద్దతు పలికారు. మేయర్ పదవిని ఆశించిన ముగ్గురు అభ్యర్థులు త్రివేణి, ఉమాదేవి, కుబేరప్ప ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయితే, ఎన్నికల్లో పార్టీ ఐక్యంగా పోటీ చేసేలా అంతర్గత తిరుగుబాటును కేపీసీసీ పరిశీలకుడు చంద్రప్ప సద్దుమణిగించారు. రాజ్యసభ ఎంపీ సయ్యద్ నజీర్ హుస్సేన్ ఉమాదేవిని పోటీ నుండి వెనక్కి తీసుకోవాలని ఒప్పించారు.

Also Read:TSPSC Paper Leakage Case: పేపర్ లీకేజ్ కేసు.. ఆ ముగ్గురి ఇళ్లల్లో సిట్ సోదాలు..?

21 ఏళ్ల వయసులో కార్పొరేటర్‌గా మారిన త్రివేణి.. 31 ఏళ్ల వయసులో మైసూరు సిటీ కార్పొరేషన్‌కు మేయర్‌గా మారిన తస్నీమ్ బానో నుంచి అతి పిన్న వయస్కురాలిగా రికార్డును కైవసం చేసుకున్నారు. కాగా, త్రివేణి తల్లి సుశీలాబాయి కూడా 2019-20లో ఒక సంవత్సరం పాటు బళ్లారి మేయర్‌గా ఉన్నారు. నేను 21 సంవత్సరాల వయస్సులో బళ్లారి నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌ని అయ్యాను. ఇప్పుడు నాకు 23 సంవత్సరాల వయస్సులో మేయర్‌ని అయ్యాను అని త్రివేణి అన్నారు. అందరి మద్దతు తీసుకొని ప్రజల కోసం పని చేస్తానని తెలిపారు. తనపై పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రివేణి చెప్పారు.