పార్లమెంట్‌పై దాడి ఘటనకు 20 ఏళ్లు.. అమరులకు నివాళులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడికి 20 ఏళ్లు నిండాయి… 2001 డిసెంబర్ 13న జరిగిన సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడికి పూనుకున్నారు.. ఈ ఉగ్రవాదులు లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందినవారిగా గుర్తించారు.. ఉగ్రదాడిని సమర్థంగా ఎదుర్కొన్న భద్రతా దళాలు.. దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి.. ఇక, ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్‌పీఎఫ్ మహిళతో పాటు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి.. ఇలా మొత్తం తొమ్మిది మంది అమరులయ్యారు. మరోవైపు.. ఈ దాడికి కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది అఫ్జల్ మహ్మద్‌కు సుప్రీం కోర్టు ఉరిశిక్షను విధించింది. అయితే, ఈ ఘటనకు ఇరవై ఏళ్ల అయినా ఆ దృశ్యం కళ్లలో ఇంకా మెదులుతూనే ఉంది.
భారత ప్రధానిగా అటల్ బిహారీ వాజ్‌పేయి ఉన్న సమయంలో 2001 డిసెంబర్ 13న.. పార్లమెంటులో శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సభలో పెద్ద రచ్చే జరుగుతోంది.. ఆ రోజు కూడా బిల్లుపై చర్చ జరగాల్సి ఉంది.. కానీ, 11:02 గంటలకు పార్లమెంటు వాయిదా పడింది. ఆ తర్వాత అప్పుడు ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రతిపక్ష నేత సోనియా గాంధీ కూడా పార్లమెంట్ నుంచి అప్పడికే వెళ్లిపోగా.. అప్పట్లో ఉపరాష్ట్రపతిగా ఉన్న కృష్ణకాంత్ కాన్వాయ్ కూడా బయల్దేరింది.. కానీ, పార్లమెంట్‌లో కొన్ని నిమిషాల్లో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోయారు.. ఉదయం 11.30 గంటల సమయంలో శ్వేతజాతీయుల అంబాసిడర్ కారులో ఐదుగురు ఉగ్రవాదులు గేట్ నంబర్-12 నుంచి పార్లమెంటులోకి ప్రవేశించారు. అది గమనించిన సెక్యూరిటీ గార్డు ఆ కారు వెనకాలే పరిగెత్తాడు.. ఉగ్రవాదుల కారు ఉపరాష్ట్రపతి కారును ఢీకొట్టింది.. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల వద్ద ఏకే-47లు, హ్యాండ్ గ్రెనేడ్లు ఉండగా, సెక్యూరిటీ గార్డులు ఆ సమయంలో నిరాయుధులుగా ఉండడంతో.. వెంటనే వారిని నిలువరించడం కష్టమైంది..
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్‌లో లేవనెత్తుతానని హామీ
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
- Trump: వైట్‌హౌస్ సిట్యుయేషన్ రూమ్‌లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
- Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్‌హౌస్
ఇక, అక్కడే ఉన్న పీఆర్‌పీఎఫ్‌కి చెందిన బెటాలియన్.. కాల్పుల శబ్దం విని అప్రమత్తమైంది. సీఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓవైపు ఎల్‌కే అద్వానీ, ప్రమోద్ మహాజన్ సహా పలువురు ప్రముఖులు సభలోనే ఉండగా.. ఊహించని ఈ పరిణామంతో అందరినీ అలర్ట్ చేశారు.. ఇంతలో ఓ ఉగ్రవాది గేట్ నంబర్ 1 నుంచి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నం చేయడం.. భద్రతా బలగాలు అతడిని హతమార్చడం క్షణాల్లో జరిగిపోయింది.. తర్వాత ఆ ఉగ్రవాది శరీరంపై ఉన్న బాంబు కూడా పేలింది. మిగతా నలుగురు ఉగ్రవాదులు గేట్ నంబర్ 4 నుంచి లోపలికి ప్రవేశించడానికి యత్నించారు.. వీరిలో ముగ్గురు ఉగ్రవాదులను అక్కడే మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.. ఇక, మిగిలిన చివరి ఉగ్రవాది గేట్ నంబర్ 5 వైపు పరుగులు పెట్టగా.. అతనిపై బుల్లెట్ల వర్షం కురిపించి హతమార్చారు సైనికులు.. ఈ పరిణామం.. ఉదయం 11:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాగింది.. మొత్తంగా ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. కుట్రదారులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఈ కేసులో అఫ్జల్ గురు, ఎస్‌ఏఆర్ గిలానీ, అఫ్షాన్ గురు, షౌకత్ హుస్సేన్‌లను అరెస్టు చేశారు. తర్వాత సుప్రీంకోర్టు జిలానీ, అఫ్షాన్‌లను నిర్దోషులుగా ప్రకటించగా.. అఫ్జల్ గురు మరణశిక్షను సమర్థించింది. 2013న తీహార్ జైలులో అఫ్జల్ గురును ఉరితీశారు.
ఆ దాడి ఘటన 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అమరులైనవారిని అంతా స్మరించుకుంటున్నారు.. ఉగ్రదాడిలో ప్రాణాలను అర్పించిన వీరులకు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు.. ఇలా అందరూ నివాళులర్పించారు.. వారి అత్యున్నత త్యాగానికి దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని పేర్కొన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. 2001లో సరిగ్గా ఇదేరోజు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రతీకగా నిలిచే పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడికి ఎదురొడ్డి నిలిచి తమ ప్రాణాలను అర్పించిన భద్రతా సిబ్బందికి నివాళులర్పిస్తున్నాను.. అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేయగా.. 2001లో పార్లమెంట్ దాడి సమయంలో విధి నిర్వహణలో వీరమరణం పొందిన భద్రతా సిబ్బందికి నేను నివాళులర్పిస్తున్నాను.. దేశానికి వారి సేవ మరియు అత్యున్నత త్యాగం ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇక, పార్లమెంట్‌పై జరిగిన దాడి ఒక పిరికిపంద చర్య అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.. ఉగ్రదాడిలో జాతి గర్వాన్ని కాపాడేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరుల ధైర్యానికి, పరాక్రమానికి వందనం చేస్తున్నానని తెలిపారు. భద్రతా బలగాల అసమాన శౌర్యం, త్యాగం దేశానికి సేవ చేయడానికి ఎల్లప్పుడూ తమకు స్ఫూర్తినిస్తుందంటూ ట్వీట్ చేశారు అమిత్‌షా.. ఇక, పార్లమెంట్ హౌస్‌పై దాడి సందర్భంగా ప్రాణత్యాగం చేసిన భద్రతా సిబ్బందికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు.
తాజావార్తలు
-
Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్‌లు ఇవే..
-
Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!
-
Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
-
RCB vs GT Final: ఆర్సీబీకి 5వ ఫైనల్.. గుజరాత్‌కు 3వ ఛాన్స్.. తొలి కప్పు కొట్టిన ఆ స్టేడియంలోనే రెండో టైటిల్ కోసం పోరాటం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..