Site icon NTV Telugu

వైసీపీకి 13 మంది సర్పంచ్‌ల మూకుమ్మడి రాజీనామా

కడప జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి షాక్ తగిలింది. కాజీపేట మండలంలో ఏకంగా 13 మంది సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వారు పత్రికా ప్రకటన విడుదల చేశారు. సంక్షేమ పథకాల అమలులో సర్పంచుల పాత్ర లేకుండా చేయడమే కాక… 14వ, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా అధికారులు దారి మళ్లిస్తున్నారని వారు ఆరోపించారు. దీంతో ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు వారు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి పంచాయతీలలో వీధి దీపాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, శానిటేషన్ పనులను బహిష్కరిస్తున్నట్లు రాజీనామా చేసిన సర్పంచులు తెలిపారు. కాజీపేట మండలంలో మొత్తం 21 పంచాయతీలు ఉండగా 13 మంది సర్పంచులు ప్రత్యేకంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా తాము సర్పంచ్ పదవికి రాజీనామా చేయడం లేదని… కేవలం వైసీపీకి మాత్రమే రాజీనామా చేస్తున్నట్లు పత్రికా ప్రకటనలో వివరించారు.

Read Also: మూడు రాజధానుల కల చెదిరిందా..?

Exit mobile version