కడప జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి షాక్ తగిలింది. కాజీపేట మండలంలో ఏకంగా 13 మంది సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వారు పత్రికా ప్రకటన విడుదల చేశారు. సంక్షేమ పథకాల అమలులో సర్పంచుల పాత్ర లేకుండా చేయడమే కాక… 14వ, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా అధికారులు దారి మళ్లిస్తున్నారని వారు ఆరోపించారు. దీంతో ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు వారు వెల్లడించారు. ఈ…