భారతదేశంలోనే ఏపీ నెంబర్ వన్ రాష్ట్రం..
అమరావతిలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 5 అంటే ప్రతి ఒక్కరికీ టీచర్స్ డే గుర్తుకొస్తుందని అన్నారు. నేను సీఎం అయినప్పటి నుంచి ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరవుతున్నాను.. భారతదేశ చరిత్రలో తల్లిదండ్రుల తర్వాత గౌరవించేది ఉపాధ్యాయులనే.. జీవితంలో ఎవర్ని మర్చిపోయినా, చదువు చెప్పిన ఉపాధ్యాయులను మాత్రం మర్చిపోలేం.. పిల్లలకు విద్యను అందించడమే కాకుండా, వారిలో స్ఫూర్తిని నింపేది టీచర్లేనని గుర్తు చేశారు. చిన్నతనంలో తనకు బోధించిన ఉపాధ్యాయుడు భక్తవత్సలం గారు ఇప్పటికీ గుర్తుంటారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే, గత ఏడాది బుడమేరు వరదల కారణంగా గురుపూజోత్సవం జరుపుకోలేకపోయామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈసారి 175 మంది ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలు, సలహాలతో వారి ఫోటోలతో కూడిన పుస్తకాన్ని ముద్రిస్తామని తెలిపారు.
లోకేష్ బెదిరింపులకు భయపడేదేలే.. రెడ్ బుక్కు మా ఇంట్లో కుక్క కూడా..
గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో 3 నెలల్లో 30 మంది చనిపోయిన వారి కుటుంబాలను వైసీపీ బృందం పరామర్శించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఒకే లక్షణాలతో ఎక్కువ మరణాలు సంభవించటంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను.. జగన్ ఆదేశానుసారం వైసీపీ బృందం వెళ్ళి ఆ గ్రామంలో 15 కుటుంబాలను పరామర్శించాం.. త్రాగు నీటి సమస్యల వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తిందని మా పరిశీలనలో ప్రాథమికంగా తేలింది.. ప్రభుత్వం ఇది కరెక్టా.. కాదా అని తేల్చుకోవాలి అని అంబటి రాంబాబు సూచించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటం దుర్మార్గం అని మాజీమంత్రి అంబాటి తెలిపారు. చంద్రబాబు తన తాబేదారులకు దోచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. తాను అవినీతి చేసినట్టు కొన్ని మీడియాల్లో వార్తలు రాశారు.. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే బ్యాచ్ మీరు.. నా మీద విజిలెన్స్ విచారణ అంటూ నానా హడావుడి చేస్తున్నారు.. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు.. మహా అయితే అరెస్టు చేస్తారు అంతేగా?.. అరెస్టు చేసినా భయపడేది లేదు.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూడా విచారణ చేస్తున్నారు.. నాపై మరో అక్రమ కేసు పెట్టటానికి ప్లాన్ చేస్తున్నారు.. కోర్టుల్లోనే తేల్చుకుంటా.. లోకేష్ బెదిరింపులకు భయపడే మనిషిని కాదు.. లోకేష్ రెడ్ బుక్ కు మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని అంబటి రాంబాబు వెల్లడించారు.
గత పాలనలో రెవెన్యూ ఉద్యోగులపై దోపిడీదారులనే ముద్ర వేశారు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించిన “కొలువుల పండుగ” కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర కీలకం.. ఉద్యమంలో పాల్గొన్న వారికి గత పదేళ్లలో సరైన గుర్తింపు రాలేదు.. గత పాలనలో రెవెన్యూ ఉద్యోగులపై దోపిడీదారులనే ముద్ర వేశారు.. పంచాయతీ, రెవెన్యూ శాఖ సిబ్బందిని దొంగలుగా చూశారు.. పంచాయతీ, రెవెన్యూ శాఖ సిబ్బంది సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. గత ప్రభుత్వం ధరణి అనే వైరస్‌ను అంటించింది.. ధరణి ద్వారా భూములు కొల్లగొట్టాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది.. ఆ పాపాలు బయట పడతాయనే వీఆర్వో, వీఆర్ఏలను తొలగించారు.. భూముల లెక్కలు తెలిసిన వీఆర్ఏ, వీఆర్వోలను గత ప్రభుత్వం తొలగించింది.. ధరణి కొరివి దయ్యంలా తయారైందని, అందుకే బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పాం.. దానికి అనుగుణంగానే ధరణిని రద్దు చేశామని సీఎం అన్నారు. ఎప్పుడైనా విశ్వాసంతో ఉండే కుక్కని చంపాలి అంటే.. పిచ్చిది అని ముద్ర వేయాలని, వాళ్ల దోపిడిని ప్రజల ముందుకు తీసుకెళ్తారని చెప్పి vra, vro కొలవులను తొలగించారని అన్నారు. అలాగే వీఆర్ఏ, వీఆర్ఓలను దోషులుగా చిత్రీకరించారని పేర్కొన్నారు.
గణేష్ నిమజ్జనాలు.. రూట్ మ్యాప్
వినాయక నిమజ్జనాలకు రూట్ మ్యాప్ విడులైంది. ఖైరతాబాద్‌లో రేపు మార్నింగ్ 6 గంటలకు ప్రధాన శోభాయాత్ర ప్రారంభం అవుతుందని పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ పరిమితులు విధించినట్లు పేర్కొన్నారు. బాలాపూర్ నుంచి చార్మినార్- అబిడ్స్-లిబర్టీ-ట్యాంక్‌బండ్-నెక్లెస్ రోడ్డు వరకు ప్రధాన శోభాయాత్ర సాగనుంది. సికింద్రాబాద్ నుంచి పాట్నీ-పరడైజ్-రాణిగంజ్-కర్బలామైదాన్-ట్యాంక్‌బండ్ మార్గం.. * దిల్సుఖ్నగర్, అంబర్పేట్, నారాయణగూడ, ఉప్పల్ నుంచి ప్రాసెషన్లు లిబర్టీ వద్ద కలుస్తాయి. టోలిచౌకీ, మెహిదీపట్నం నుంచి వచ్చిన విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్డుకు చేరతాయి. టప్పాచబుత్రా, ఆసిఫ్‌నగర్ నుంచి వచ్చిన విగ్రహాలు ఎంజే మార్కెట్లో కలుస్తాయి. ప్రధాన రూట్లపై ఇతర వాహనాలకు అనుమతి లేదు. సౌత్ జోన్: అలియాబాద్, మదీనా, నయాపూల్, ఎంజే మార్కెట్, దారుషిఫా.. సౌత్ ఈస్ట్ జోన్ డైవర్షన్ పాయింట్లు: కేశవగిరి, చాంద్రాయణగుట్ట, మూసారాంబాగ్, చంచల్‌గూడ.
మహిళా అధికారుల పట్ల తనకు పూర్తి గౌరవం ఉంది..
ముంబై- మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ మధ్య వాగ్వాదం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ విషయంపై ఆయన స్పందించారు. చట్టపరమైన విషయాల్లో జోక్యం చేసుకోనని ఆయన స్పష్టం చేశారు. కేవలం అక్కడి పరిస్థితిని చక్కదిద్దేందుకే తాను ఐపీఎస్ అధికారిణికి ఫోన్ చేసినట్లుగా తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు చేపట్టారు ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణ. దీంతో ఆమెకు కాల్ చేసి ఆ చర్యలను వెంటనే ఆపాలని ఆదేశించారు. నీకు ఎంత ధైర్యం… ఉప ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే నమ్మవా అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే వీడియో కాల్ చేయమంటావా అంటూ.. ఫోన్ లోనే వీరంగం సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో.. ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళా అధికారుల పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని.. చట్టానికి కట్టుబడి ఉంటానని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇసక, మైనింగ్ అక్రమ కార్యకలాపాలకు నేను ఎప్పటికి వ్యతిరేకమే అని ఆయన అన్నారు.
GST 2.0లో కొత్త కార్ల ధరలు ఎంత తగ్గాయో తెలుసా..
ఆగస్టు 15న తన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ GSTపై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అనంతరం తాజాగా జీఎస్టీ సంస్కరణలు దేశంలో చోటుచేసుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన కొత్త GST రేట్లతో ఆటోమొబైల్ రంగంలో ఉత్సాహం నెలకొంది. తాజాగా GST 2.0 లో కొత్త కార్ల ధరలు ఎంత మేరకు తగ్గాయో తెలుసా.. ఈ స్టోరీలో ఏయే కార్లపై ఎంత మేరకు తగ్గుదల నమోదు అయ్యిందో తెలుసుకుందాం.. మారుతి సుజుకి ఆల్టో కె10 : భారతదేశంలో అత్యంత సరసమైన కారు. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ప్రొపెల్డ్ హ్యాచ్‌బ్యాక్‌లు కలిగి ఉండటం దీని ప్రత్యేక. తక్కువ ధరకు రావడంతో ఇది ప్రైవేట్, టాక్సీ విభాగాలలో బాగా ప్రాచుర్యం పొందింది. జీఎస్టీ 2.0తో ఆల్టో కె10 ఖర్చు తగ్గనుంది. దీని ధర ₹ 4.23 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి సుమారు ₹ 3.89 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు తగ్గుతుందని భావిస్తున్నారు. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో.. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో దేశంలో ప్రారంభించిన కొద్ది కాలంలోనే భారతీయ కార్ల కొనుగోలుదారులలో గొప్ప ప్రజాదరణను సొంతం చేసుకుంది. పొడవైన SUV స్టాన్స్‌తో కూడిన ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ 1.0-లీటర్ పెప్పీ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. చిన్న, కాంపాక్ట్ సైజు, దీని ఇంజిన్ దేశంలోని చాలా మంది వినియోగదారులకు, ప్రైవేట్, టాక్సీ విభాగాలలో మంచి పేరు సొంతం చేసుకుంది. ఇది కూడా జీఎస్టీ సంస్కరణలతో ధర తగ్గుతుందని భావిస్తున్నారు.
ఉక్రెయిన్‌కు ఎవరు సహకరించిన వారినీ టార్గెట్ చేసుకుంటాం..
ఉక్రెయిన్‌కు సహకరించే ఏ దేశనైనా తమ సైన్యం టార్గెట్ గా చేసుకుంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో తమకు వ్యతిరేకంగా నిలిచే దేశాలను చట్టబద్ధమైన లక్ష్యాలుగా చేసుకునే అధికారం తమకు ఉందన్నారు. ఎలాంటి బలగాల మోహరింపు దీర్ఘకాలిక శాంతికి అనుకూలంగా ఉండదన్నారు. పశ్చిమ దేశాలతో ఉక్రెయిన్‌కు ఉన్న సన్నిహిత సైనిక సంబంధాలు ఇరు దేశాల మధ్య ఘర్షణకు ప్రధాన కారణం అన్నారు. రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ఫలించి యుద్ధం ఆగిపోతే, ఉక్రెయిన్‌కు సపోర్టుగా ఆ దేశంలో ఇతర దేశాల సాయుధ దళాలను మోహరించాల్సిన అవసరం ఏముందని పుతిన్ ప్రశ్నించారు. అయితే, తాము చేసుకున్న ఒప్పందానికి రష్యా కట్టుబడి ఉంటుందని పుతిన్ తెలిపారు. 26 ఐరోపా దేశాల నేతలు గురువారం నాడు పారిస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయినా నేపథ్యంలో రష్యా అధినేత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, సెప్టెంబర్ 4న పారిస్‌లో కీవ్‌కు కావాల్సిన భద్రతను కల్పిస్తామని ఐరోపా నేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.
టీమిండియాకు అతడు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారతాడు.. ఆసియా కప్ మనదే!
ఆసియాకప్ -2025 కోసం టీమిండియా సన్నాహాకాలను స్టార్ట్ చేసింది. ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న సూర్య సేన ఇవాళ తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనింది. మరో 3 రోజుల పాటు ఐసీసీ అకాడమీలో ఏర్పాటు స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో భారత ప్లేయర్లు శ్రమించనున్నారు. అయితే, టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడబోతుంది. ఈ నేపథ్యంలో వెటరన్ ఆటగాడు అజింక్య రహానే మాట్లాడుతూ.. భారత జట్టు తరపున అక్షర్ పటేల్ అద్బుతంగా రాణిస్తున్నప్పటికి, అతడికి తగినంత గుర్తింపు రాలేదన్నాడు. ఇక, అక్షర్ ఒక అండర్రేటెడ్ ప్లేయర్.. గత మూడేళ్లలో ఒక క్రికెటర్‌గా అతడు చాలా మెరుగుపడ్డాడు.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా చాలా అద్బుతంగా ఆడుతున్నాడు.. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా బ్యాటర్‌గా, బౌలర్‌గా తన మార్క్‌ను చూపిస్తున్నాడని రహానే పేర్కొన్నారు.
లిటిల్ హార్ట్స్.. పెద్ద సినిమాలను ఓడించిన కంటెంట్
90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న మౌళి తనూజ్.. హీరోగా చేసిన మొదటి మూవీ లిటిల్ హార్ట్స్. ఈ సినిమా చాలా చిన్న బడ్జెట్ తో వచ్చింది. పైగా మౌళికి హీరోగా మొదటి మూవీ. సెప్టెంబర్ 5న ఘాటీ, మదరాసి లాంటి బడా సినిమాలు ఉన్నాయి. అంత పెద్ద సినిమాలు ఉన్నాయని తెలిసినా సరే ఈ సినిమా యూనిట్ వెనకడుగు వేయలేదు. కంటెంట్ ను బలంగా నమ్మారేమో. అదే వాళ్లను నిలబెట్టింది. ప్రేక్షకులకు నచ్చాలంటే పెద్ద బడ్జెట్, పెద్ద యాక్షన్ సీన్లు, స్టార్ హీరో, హీరోయిన్లు అవసరం లేదని గతంలో చాలా మూవీలు నిరూపించాయి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కూడా అలాంటి కోవలోకే వచ్చింది. సింపుల్ కథ, కథనం, ప్రేక్షకులను నవ్వించే సీన్లు ఇవే లిటిల్ హార్ట్స్ ను ప్రేక్షకులకు నచ్చేలా చేశాయి. అనుష్క లాంటి సీనియర్ హీరోయిన్, క్రిష్ లాంటి దర్శకుడి కాంబోలో భారీ బడ్జెట్ తో వచ్చిన ఘాటీ ఆడియెన్స్ కు యావరేజ్ గా అనిపించింది. మరి అంత పెద్ద బడ్జెట్, యాక్షన్ సీన్లు, హీరోలు దగ్గరుండి ప్రమోట్ చేశారు కదా.. మరి ఎందుకు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కారణం ఒక్కటే కంటెంట్, స్క్రీన్ ప్లే, డైలాగులు. ఇవి బాగుంటే చాలు ప్రేక్షకులకు అది పెద్ద సినిమానా, చిన్న సినిమానా, కొత్త హీరోనా అనేది పట్టించుకోరు. మదరాసి విషయంలోనూ ఇదే జరిగింది. రొటీన్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఆ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.