మూడు దాడులు, ఆరు తప్పుడు కేసుల్లా పాలన.. మాజీ మంత్రి ఫైర్
మూడు దాడులు, ఆరు తప్పుడు కేసుల్లా.. రాష్ట్రంలో పాలన ఉంది అంటూ కూటమి సర్కార్‌పై మండిపడ్డారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ప్రతిరోజూ వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూనే ఉన్నారు. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును చంపేందుకు ప్రయత్నించారు. పొన్నూరు ఎమ్మెల్యేకి తెలియకుండానే ఈ హత్యాయత్నం జరిగిందా? అని ప్రశ్నించారు. ఆ నిందితులను ఎమ్మెల్యేనే రక్షించి ఊరు దాటించేశారు అని ఆరోపించారు.. రెడ్ బుక్ ను కొనసాగించేందుకు కొందరు అధికారులు, రిటైర్డ్ అయినవారు కలిసి అజ్ఞాతంగా పని చేస్తున్నారు. పోలీసులు ఈ దాడులను ఆపాలని చూడడం లేదు. అజ్ఞాత వ్యక్తులు మాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.. పల్నాడులోని గుండ్లపాడులో టీడీపీలోని రెండు వర్గాలు గొడవ పడి చంపుకుంటే మా పార్టీ నేతలపై కేసులు పెట్టారు. ఎస్పీ ఒకమాట చెప్తే తర్వాత మళ్లీ మాట మార్చి మాపార్టీ వారు నిందితులన్నారు అని మండిపడ్డారు.
తన చెల్లిని ప్రేమిస్తున్నాడని కోపం.. పార్టీ అని పిలిచి చంపి పాతిపెట్టిన అన్న..
తన చెల్లిని ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిపై కోసం పెంచుకున్న యువకుడు.. పార్టీ అంటూ పిలిచి.. దారుణంగా హత్య చేసి.. పాతిపెట్టిన కాకినాడ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా పి వేమవరంలో తన చెల్లిని ప్రేమిస్తున్నాడని కిరణ్ కార్తీక్ అనే యువకుడుని కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి చంపి పూడ్చి పెట్టాడు.. కృష్ణ ప్రసాద్ చెల్లితో కిరణ్ కార్తీక్ సన్నిహితంగా ఉంటున్నాడు… దాంతో కిరణ్ కార్తీక్ ను పార్టీకి అని పిలిచి మద్యం పట్టించి చంపి లే అవుట్ లో పాతిపెట్టాడు.. కృష్ణ ప్రసాద్, స్నేహితులు సాయం తీసుకుని కిరణ్ కార్తీక్ ను అతి కిరాతకంగా చంపేశాడు ఈ ఘటన గత నెల 24న జరిగింది.. అప్పటినుంచి తన కుమారుడు కిరణ్ కార్తీక్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు తల్లిదండ్రులు.. అయితే, విచారణ జరుగుతుండగా భయంతో పోలీసులకు లొంగిపోయారు నిందితులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..
ఇంటర్ విద్యపై లోకేష్ సమీక్ష.. కీలక ఆదేశాలు
ఇంటర్ విద్యలో యూడైస్.. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేష్ ఎన్‌రోల్‌మెంట్‌ను సమర్థవంతంగా చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్యపై ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి లోకేష్.. అయితే, ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో 5 లక్షల 965 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. పదో తరగతి పూర్తైన విద్యార్థులు ఇంటర్ లేదా వృత్తి విద్యా కోర్సుల్లో తప్పనిసరిగా ప్రవేశం పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక, టెన్త్ పూర్తి చేసిన ఏ విద్యార్థి ఇంట్లో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు మంత్రి లోకేష్… ప్రతి విద్యార్థి ఎక్కడ ప్రవేశం పొందారో ట్రాక్ చేయాలని, పాఠశాల విద్యతోనూ సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో నిరక్షరాస్యులకు అక్షర ఆంధ్ర. ప్రాజెక్ట్ అఆ కార్యక్రమం ఆగష్టు 7వ తేదీ నుంచి ప్రారంభించనన్నట్లు అధికారులు వివరించారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రతి ఏడాది ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా లాంగ్వేజ్ సబ్జెక్ట్ మార్కులను మిగతా సబ్జెక్టుల మార్కుల సగటుగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.
2026 ఆగస్టులోపే నక్సల్స్ను తుడిచిపెట్టేస్తాం..
చాలా మంది యోధులు చిన్న వయసులోనే స్వాతంత్ర్య కోసం ప్రాణాలు వదిలారు అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు వంటి వాళ్ళు ఎంతోమంది తమ ప్రాణాలు వదిలారు.. భారత స్వాభిమానం, తెలుగు రాష్ట్రాల గుర్తుగా నిలిచిపోయారు.. అల్లూరి కేవలం పోరాట యోధుడే కాదు ప్రజలు కోసం అన్ని కోల్పోయిన నాయకుడు గుర్తుకు వస్తాడు.. సాంస్కృతిక ఆత్మ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచుతుంది.. అల్లూరి పేరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కే కాదు దేశం మొత్తం గుర్తింపు ఉంది.. ఆడవుల నుంచి పుట్టిన పోరాటాలు ఇప్పటికీ గుర్తున్నాయి.. దశాబ్దాల పోరాటాలకు ఆయన మార్గదర్శనం చేశారు.. అడవుల్లో ఆయన పోరాటాలు బ్రిటిష్ వారిని వణికించాయి.. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలు ఎత్తాల్సి వచ్చింది అని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు.. 100 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి వస్తాం..
ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సామాజిక న్యాయం సమరభేరి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నాయి.. కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చిన చోట బాధ పడకండి.. మీకు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది అని భరోసా ఇచ్చారు. మిమ్మల్ని మంత్రులు చేసే అవకాశం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ చూసుకుంటారు.. టికెట్ల కోసం డిల్లీకి పోవాల్సిన బాధ లేదు.. మీకు టికెట్లు ఇచ్చి తొవ్వ ఖర్చులు ఇచ్చి కూడా పంపుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు.. 100 అసెంబ్లీ సీట్లు గెలిచి వస్తాం.. 100కి ఒక్క సీటు కూడా తగ్గకుండా గెలుస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి మాటిస్తున్నాను అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో గోదావరి నీళ్లను ఏపీ దోపిడి చేస్తామంటే చూస్తూ ఊరుకుంటామా..?
పోలవరం, పోతిరెడ్డిపాడు, పులిచింతల లాంటి ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ 20 ఏళ్ల క్రితం ఇదే రోజున (04/07/2005) మంత్రి పదవులకు రాజీనామాలు చేశామని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. కేసీఆర్ ఆదేశాలతోనే.. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ నీటి హక్కుల కోసం పదవులను గడ్డి పోచలుగా భావించి వదులుకున్నామని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో.. ఆంధ్రప్రదేశ్ సర్కార్ బనకచర్ల ప్రాజెక్టు పేరిట గోదావరి నీళ్ల దోపిడి చేస్తానంటే చూస్తూ ఊరుకుంటామా? అని మండిపడ్డారు. నాడైనా, నేడైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీసే ఏ కుట్రలనైనా బీఆర్ఎస్ పార్టీ సహించదు అని హరీష్ రావు వెల్లడించారు.
ప్రతీ 40 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్ట్.. ప్రతీ గంటకు 60 అదనపు విమానాలు..
భారత దేశంలో ప్రతీ 40 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం ఏర్పాటు అవుతోంది.. ప్రతీ గంటకు 60 అదనపు విమానాలు భారత్‌లో సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరుగుతోన్న ఏవియేషన్ సదస్సులో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, ఉత్తరాది రాష్ట్రాల మంత్రులు, అధికారులతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా గత 10 ఏళ్లలో 88 కొత్త ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేశారని తిలిపారు.. ప్రతి 40 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం ఏర్పాటు అవుతోంది.. ప్రతి గంటకు 60 అదనపు విమానాలు భారత్‌లో సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు.. UDAN ప్రాజెక్ట్ విస్తరణతో పాటు హెలిపోర్ట్ వ్యవస్థ అభివృద్ధిపై దృష్టి పెట్టామన్నారు.. ప్రైవేట్ రంగంతో కూడిన కేంద్ర రాష్ట్ర సమన్వయంతో వైమానిక రంగ అభివృద్ధి జరుగుతోందన్నారు.. వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాంతీయ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..
భారత్‌కు షాక్.. పాకిస్తాన్-రష్యా మధ్య కీలక ఒప్పందం..
భారత మిత్రదేశం రష్యా, శత్రుదేశం పాకిస్తాన్ మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌ని మధ్య ఆసియా దేశాల మీదుగా, రష్యాతో అనుసంధానించేలా భారీ రోడ్డు, రైలు మార్గాలు నిర్మించేందుకు రెండు దేశాలు సహకరించుకోవడానికి అంగీకరించినట్లు శుక్రవారం పాక్ మీడియా తెలిపింది. సెంట్రల్ ఆసియాలోని కజకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్ వంటి దేశాలను ఈ మార్గం ద్వారా అనుసంధానించనున్నారు. భూపరివేష్టిత దేశాలుగా ఉన్న మధ్య ఆసియా దేశాలకు ఓడరేవులను అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.
ఈడీ విచారణపై స్పందించిన అల్లు అరవింద్..
నిర్మాత అల్లు అరవింద్ ను ఈ రోజు ఈడీ అధికారులు విచారించడం సంచలనం రేపింది. అసలు సడెన్ గా ఆయన్ను ఎందుకు ఈడీ విచారించింది.. ఆ స్కామ్ కు ఆయనకు సంబంధం ఏంటి అంటూ ఒకటే రూమర్లు తెరమీదకు వచ్చాయి. ఎట్టకేలకు ఈ విచారణపై అల్లు అరవింద్ స్పందించారు. “నేను 2017లో ఒక ప్రాపర్టీ కొన్నాను. అందులో ఒక ఒక మైనర్ వాటాదారుడు ప్రాపర్టీ కొన్నాను. కానీ కొన్న తర్వాత అతని మీద ఈడీ ప్రాబ్లమ్ ఉన్నట్టు తెలిసింది. నాకు ముందు తెలియలేదు. అతను బ్యాంక్ లోన్ తీసుకుని ఎగ్గొటాడని తెలిసింది. అప్పటి నుంచే అతని మీద ఈడీ నిఘా ఉంది. కానీ ఈడీ దగ్గర ఉన్న బుక్ ఆఫ్ అకౌంట్స్ లో నా పేరు ఉంది. అందుకే ఈడీ అధికారులు నన్ను విచారణకు పిలిచారు. ఒక బాధ్యత గల పౌరుడిగా నేను వెళ్లాను. వాళ్లు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను. అంతే తప్ప ఇందులో ఇంకేమీ లేదు. మీడియా వాళ్లే కావాలని దీన్ని పెద్దది చేసి చూపించారు. వాళ్ళు ఎంక్వయిరీకి పిలిస్తే వెళ్లాను. అంతకు మించి ఏమీ లేదు” అంటూ చెప్పుకొచ్చారు అల్లుఅరవింద్. దాంతో ఈ రూమర్లకు చెక్ పడ్డట్టు అయింది. అరవింద్ ప్రస్తుతం వరుస సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉంటున్నారు.
ఒకప్పుడు అవమానాలు.. లైఫ్ ఇచ్చిన పవన్ కల్యాణ్..
పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ నిన్న రిలీజై భారీ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. టాలీవుడ్ లోనే టాప్ వ్యూస్ తో దుమ్ము లేపుతోంది ఈ ట్రైలర్. ఈ సందర్భంగా ట్రైలర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చిన అర్జున్ దాస్ గురించే చర్చ జరుగుతోంది. అతని వాయిస్ కు అంతా ఫిదా అవుతున్నారు. కానీ అదే వాయిస్ తో తాను అవమానాలు పడ్డానని గతంలో అర్జున్ దాస్ తెలిపాడు. చెన్నైలో పుట్టి పెరిగిన అర్జున్ దాస్.. కాలేజీ రోజుల్లోనే తన బేస్ వాయిస్ ప్రసంగాలతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చదువుకుని దుబాయ్ లో సెటిల్ అయ్యాడు. అక్కడే ఐదంకెల జీతంతో హాయిగా గడిపాడు. కానీ అతనికి సినిమాల్లోకి రావాలని ఆశ ఉండేది.