NTV Telugu Site icon

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌

క్రిస్మస్ పండగ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఇడుపులపాయల నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల చేరుకున్న సీఎం జగన్ సీఎస్ఐ చర్చికి వెళ్లి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. తల్లి విజయమ్మతో పాటు భార్య భారతి కుటుంబ సభ్యులు ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కొందరు స్థానికుల సమక్షంలో క్రిస్మస్ ప్రార్థనలో జగన్ పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి తల్లికి తినిపించారు. విజయమ్మ కూడా కేక్ కట్ చేసి కుమారుడు జగన్కు తినిపించి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. క్యాలెండర్ కూడా ఆవిష్కరించారు సీఎం జగన్‌. క్రిస్మస్ వేడుకల అనంతరం సీఎం జగన్ పులివెందుల నుంచి బయలుదేరి కడప విమానాశ్రయం చేరుకున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్లారు. ఇదిలా ఉంటే.. క్రిస్మస్‌ సందర్భంగా సీఎం జగన్‌.. ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు. మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజలకు కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు లభించాలని ఆకాంక్షించారు సీఎం వైఎస్‌ జగన్‌.

అనుమానంతో భర్త మర్మాంగాన్ని గోళ్ళతో రక్కేసిన భార్య

అనుమానంతో నిండునూరేళ్ల జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు కొందరు. నిజమేంటో తెలియకుండానే లేనిపోని ఊహాలకు పోయి క్షణికావేశాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే.. ఓ దంపతుల మధ్య అనుమానం పెనుభూతంగా మారింది. మహేంద్ర, సంధ్య దంపతులు. అయితే.. వీరికి వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు అవుతుంది. అయితే.. మండలంలోని పెనుబాక దళితవాడకు చెందిన మహేంద్ర ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే.. భార్య సంధ్యకు భర్త పరస్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం ఉంది. అయితే.. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. భర్త మహేంద్రకు సైతం తన భార్య సంధ్యపై ఇదే అనుమానం ఉండటంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. అయితే.. నిన్న కూడా ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో.. ఇద్దరు ఒకరిపైఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. అదే సమయంతో భార్య సంఖ్య భర్త మహేంద్ర మర్మాంగాన్ని గోళ్ళతో రక్కేసింది. ఈ క్రమంలో మహేంద్ర ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికత్స పొందుతున్నాడు. అయితే.. ఈఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.

Read also: Traffic Diversions: రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి.. 26 నుంచి 30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

వైశాలి కిడ్నాప్ కేసు.. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌

తెలంగాణలో సంచలనం సృష్టించిన వైశాలి కిడ్నాప్ కేసు రోజురోజుకు మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం నవీన్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నాడు. రంగారెడ్డి కోర్టు అనుమతితో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు సీన్ రీ కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఆ తర్వాత నవీన్ రెడ్డిపై గతంలో ఉన్న కేసుల వివరాలను కోరుతున్నారు. నిన్న శనివారం ఉదయం జైలు నుండి ఆదిభట్ల పీ.ఎస్.కు నవీన్ రెడ్డి నీ పోలీస్ లు తరలించారు.

లింకులు పెట్టి లక్షణాల్లో లక్షలు కాజేస్తున్న సైబర్ కేటుగాళ్లు

కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన నిఖిల్ గౌడ్ అనే యువకునికి ఇన్ స్టాగ్రామ్ లో ఓ లింకును పంపిన సైబర్ కేటుగాళ్లు. దీంతో లింకును బాధితుడు నిఖిల్ గౌడ్ ఓపెన్ చేశాడు. ఇదే సమయంగా భావించిన సైబర్ కేటుగాళ్లు అమౌంట్ పంపాలని సూచించారు. ఎందుకు చేయాలని దానికి లాభమేంటని అడిగాడు బాధితుడు దీంతో.. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికారు. నిజంగానే లాభాలు వస్తాయని నమ్మిన బాధితుడు నిఖిల్‌.. విడతలవారీగా UPI అకౌంట్ ద్వారా 1,12,400 లక్ష పంపాడు. తరువాత అతనికి తిరిగి ఒక్క పైసా కూడా రాకపోవడమే సందేహం వచ్చింది. దీంతో వారి నెంబర్‌ కు తిరిగి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ఛాఫ్. అంతే నిఖిల్‌ షాక్‌ తిన్నాడు. ఇది ఫేక్‌ అని తను మోసపోయానని గ్రహించి స్థానిక దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొన్న దేవునిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అటల్ స్పూర్తితో మోడీ పాలన సాగిస్తున్నారు

అటల్ స్పూర్తితో మోడీ పాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భరతమాత ముద్దుబిడ్డ, మృదుస్వభావి, స్థితప్రజ్ఞత కల్గిన ఋషి , దేశం కోసమే జీవించిన తాపసి, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బండి సంజయ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. అనంతరం భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. వాజపేయి జయంతి సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

read also: Eating Fish: చేపలు తినేవారు తెలుసుకోండి!

చైనాలో కరోనా కల్లోలం

చైనాలో కరోనా కేసులు ఉల్క వేగంతో పెరుగుతూ ఉన్నాయి. వైరస్ బారిన పడిన ప్రజలు కోకొల్లలుగా మరణం బారిన పడుతున్నారు. ఆ దేశంలోని ఐసీయూల్లో ఆస్పత్రి బెడ్లు పేషంట్లతో నిండిపోయాయి. దేశవ్యాప్తంగా శ్మశాన వాటికలు నిండిపోతున్నాయి. ప్రజలు తమ అయినవాళ్ల అంత్యక్రియల కోసం గంటల తరబడి వేచి ఉండవలసి వస్తోంది. రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. కానీ డ్రాగన్‌ ప్రభుత్వం మాత్రం కరోనా విషయంలో కాకి లెక్కలు చెప్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం కొవిడ్-19 కారణంగా కొద్ది మంది మాత్రమే మరణిస్తున్నారని చైనా అధికారులు తెలిపారు. రద్దీగా ఉంటే ఆస్పత్రి వార్డులు నిండిన శ్మశాన వాటికల దృశ్యాలను చైనా ప్రభుత్వ మీడియా ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని సమాచారం. జీరో కోవిడ్ పాలసీ పేరుతో మూడేళ్ల పాటు వైరస్‌ను కట్టడి చేయగలిగిన చైనా.. ప్రజల జీవితాలతో ఆటాడుకుంది. కానీ ఆ పాలసీ బెడిసి కొట్టడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ మీద దృష్టి పెట్టకపోవడం.. అందుకు సంబంధించిన పరిశోధనలు సజావుగా జరగకపోవడం వల్ల కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయి. చేసేదేమీ లేక ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రపంచంలో ఏ దేశం కరోనాతో ఇంత భయానకమైన పరిస్థితిని ఎదుర్కొలేనంత దారుణంగా తయారైంది పరిస్థితి. చైనాలో ప్రస్తుతం కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు బెడ్లు దొరకడం లేదు. ఎక్కడ పడితే అక్కడ పేషెంట్లకు చికిత్స అందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లను తీసుకెళ్తున్న అంబులెన్స్‌లు.. ఆస్పత్రుల నిరాకరణతో సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో మరణాలూ సంభవిస్తున్నాయి.

బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం

ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. 2-0తో టెస్ట్‌ సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ తీవ్రంగా కష్టపడింది. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. 45/4 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా వెంటనే వికెట్లను కోల్పోయింది. అనంతరం అయ్యర్‌(29), అశ్విన్‌(42) నిలకడగా ఆడుతూ భారత జట్టును విజయ తీరాలకు చేర్చారు. 7 వికెట్లు కోల్పోయి 145 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మిరాజ్‌ 5 వికెట్లు తీయగా.. షకీబ్‌ 2 వికెట్లు తీశాడు.

Read also: Mangaluru: ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు.. మంగళూరులో 144 సెక్షన్

చలపతిరావు మరణం కలచివేసిందన్న చిరంజీవి, బాలకృష్ణ

సీనియర్‌ నటుడు చలపతిరావు గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా చిరంజీవి, చలపతిరావు మృతి పట్ల సంతాపం తెలియ జేశారు. చిరంజీవి స్పందిస్తూ.. చలపతిరావు గారి మరణం తనను కలచివేసిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంటూ, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాలకృష్ణ చలపతిరావు మృతిపై దిగ్భ్రాంతి చెందారు. తమ కుటుంబానికి చలపతిరావుతో మంచి అనుబంధం ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు.

ప్రభాస్ కొత్త సినిమా రాజా డీలక్స్ ఫోటో లీక్.. వైరల్

బాహుబలి సినిమా తర్వాత తీసిన ప్రతీ సినిమా ప్లాప్ కావడంతో సాలీడ్ హిట్ కోసం చూస్తున్నాడు ప్రభాస్. బాహుబలి ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే.. ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ ఫ్లాప్ కావడంతో ఇక మీదట తీసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు రెబల్ స్టార్. కొన్ని నెలల కిందట ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్‎కు నెగిటివ్ టాక్ రావడంతో మళ్లీ రీ షూట్ చేసే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. ఇక ప్రభాస్‌ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. అందులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హార్రర్‌ డ్రామా ‘రాజా డీలక్స్’. ప్రస్తుతం చిత్రయూనిట్‌ సెకండ్‌ షెడ్యూల్‌ జరుపుకుంటుంది. ఎలాంటి సందడి లేకుండా లో ప్రొఫైల్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే షూటింగ్‌ సెట్‌లో ప్రభాస్‌కు సంబంధించిన ఫోటో ఒకటి లీక్‌ అయింది. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈజిప్టులో కూలిన స్టేడియం.. అభిమానుల మధ్య తొక్కిసలాట

ఈజిప్టు రాజధాని కైరోలో ఘోరం జరిగింది. బాస్కెట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా అభిమానులు నిలుచున్న స్టేడియం ఉన్నట్లుండి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 27 మంది గాయపడ్డారు. అల్ అహ్లీ మరియు ఇత్తిహాద్ మధ్య జరిగిన సూపర్ కప్ మ్యాచ్ సందర్భంగా, స్టాండ్స్‌లో తొక్కిసలాట వల్ల సీట్లలో కొంత భాగం ప్రేక్షకులపై పడిందని అధికారులు తెలిపారు.
Stadium Collapsed : ఈజిప్టులో కూలిన స్టేడియం.. అభిమానుల మధ్య తొక్కిసలాట

Show comments