ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు, టూరిజం కేంద్రాలు మూత..!
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావం వల్ల మరో మూడు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. ఆరెంజ్ బులెటిన్ హెచ్చరికలు జారీ చేసింది.. అల్లూరి జిల్లాలో జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాపరాయి, డుడుమ, సరియ టూరిజం కేంద్రాలను యంత్రాంగం తాత్కాలికంగా మూసి వేశారు అధికారులు… అటు, విశాఖ తీరం అలజడిగా మారింది. సముద్రం చొచ్చుకుని రావడంతో తీరం పెద్ద ఎత్తున కోతకు గురి అవుతోంది. శ్రీకాకుళం పట్టణంలో పాటు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది.. రహదారుల పైన వర్షపునీరు నిలిచిపోయింది.. వాహనదారులపై వాహనదారులు అవస్థలు పడుతున్నారు.. ఆర్టీసీ కాంప్లెక్స్ సహా మరికొన్ని ప్రాంతాలు నీటమునిగాయి.. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రైతు బజార్ వరకు పూర్తిగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.. మరోవైపు.. భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు.. అంగన్వాడీలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్.
ఐఏఎస్ లక్ష్మీపై భూమన సంచలన వ్యాఖ్యలు.. ఏ విచారణకైనా రెడీ అంటూ సవాల్
ఐఏఎస్ అధికారి లక్ష్మీపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. టీటీఆర్ బాండ్లు విషయంలో ఏ విచారణకైనా నేను సిద్ధం అంటూ సవాల్ విసిరారు.. నాపై వచ్చే విమర్శలకు నేను ఎప్పుడూ స్పందించను.. కానీ, రెండు సంవత్సరాలు నా మనసులో ఉన్న అభిప్రాయం ఇది అన్నారు.. గతంలో ఉన్న ఐఏఎస్ అధికారి… అవినీతిలో అనకోండ లాంటి అధికారి అని ఆరోపించిన ఆయన.. గతంలో మంత్రులను అందరి పూచికపుల్లలా చూసింది.. తన శాఖకు సంబంధించిన మంత్రులను లెక్క కూడా చేయాని అధికారి.. డబ్బులు సంపాదించడమే తప్ప ఎలాంటి నైతిక విలువలు లేని అధికారిని.. ఒ తాటకీలాగా కింది స్థాయి అధికారుల పట్ల వ్యవహరించారు అంటూ విమర్శలు గుప్పతించారు.
రౌడీషీటర్ శ్రీకాంత్‌కు జైలు అధికారుల మెమో.. ఆ వీడియోపై వివరణ కోసం..!
రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది.. ఇక, ఆస్పత్రికి శ్రీకాంత్‌ను తీసుకొచ్చిన సమయంలో అతడి ప్రియురాలు అరుణతో సన్నిహితంగా ఉన్నర వీడియో వైరల్ కావడం కలకలం రేపింది.. ఈ వ్యవహారంలో జైలు అధికారులు, ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి.. అయితే విశాఖ సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా ఉన్న శ్రీకాంత్ కు మెమో జారీ చేశారు నెల్లూరు జైలు సూపరిండెంటెంట్ … పెరోల్ రద్దుచేసి ఈ నెల 23వ తేదీన విశాఖ సెంట్రల్ జైలుకు శ్రీకాంత్ ను తరలించారు అధికారులు.. అయితే, పెరోల్ రాక ముందు శ్రీకాంత్ ను నెల్లూరు జైలు అధికారులు వైద్యం కోసం హాస్పిటల్ కి తరలించారు.. హాస్పిటల్‌లో అతని ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది… ఈ వీడియోపై వివరణ కోరుతూ నెల్లూరు సూపరింటెండెంట్ విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీకాంత్ కు మెమో పంపించారు.. అయితే, నెల్లూరు జైలు అధికారి ఇచ్చిన మెమోపై వివరణ ఇచ్చేందుకు టైం కోరాడ శ్రీకాంత్.. కాగా, శ్రీకాంత్ వివరణ ఇచ్చిన తర్వాత పరిశీలించి.. చర్యలు తీసుకుంటామని జైలు అధికారులు చెబుతున్నారు..
కర్నూలులో భర్తను దారుణంగా చంపిన భార్య.. మూడు రోజుల తర్వాత..!
క్రైమ్ పెరిగిపోతోంది.. భార్యలను భర్తలు ఓవైపు.. భర్తలను భార్యలు మరోవైపు కాటికి పంపుతున్నారు.. కొన్నిసార్లు తొందరపాటు.. మిరికొన్ని సార్లు వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి.. దీంతో, కట్టుకున్న భార్య అని చూడకుండా.. భరించే భర్త అని కూడా చూడకుండా.. ఇతరులతో చేతులు కలిపి హత్యలు చేస్తున్నారు.. తెలుగు రాష్ట్రాల్లోనూ హత్య ఘటనలు వరుసగా వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా, కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. మద్దికేర మండలం ఎం అగ్రహారంలో భర్తను దారుణంగా హత్య చేసింది ఓ మహిళ. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటేష్ అనే వ్యక్తిని భార్య సరస్వతి మూడు రోజుల క్రితం హత్య చేసింది.. ఆ తర్వాత ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచింది.. అక్కడి నుంచి పరారైంది.. కానీ, ఇంటి నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు… ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటి తలపులను తొలగించి చూస్తే.. వెంకటేష్ మృతదేహం కనిపించింది.. కాగా, ఆస్తి కోసమే భర్తను సరస్వతి హత్య చేసిందని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. మరోవైపు, వెంకటేష్ భార్య సరస్వతి పోలీసుల ముందు లొంగిపోయింది.
ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుండి ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. ఈ సమావేశాలు మొత్తం 3 రోజులపాటు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. సమావేశాల నిర్వహణ కోసం అసెంబ్లీ సిబ్బందికి ఇప్పటికే సంబంధిత ఆదేశాలు జారీ చేయబడినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ జరగనుంది. తెలంగాణ క్యాబినెట్ ఇటీవలే ఈ రిపోర్టును ఆమోదించింది. పూర్తి స్థాయిలో రూపొందించబడిన రిపోర్టు మొత్తం 600 పేజీలకు పైగా ఉంది. అసెంబ్లీ సభ్యులకు ఈ రిపోర్టును అందజేసి, అన్ని పార్టీల అభిప్రాయాలను సవివరంగా తెలుసుకొని, తర్వాత పూర్తి స్థాయిలో చర్చలు నిర్వహించడం లక్ష్యంగా ఉంది. చర్చల అనంతరం, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు సంబంధించి తుది నిర్ణయాలు తీసుకోవడం, తద్వారా ప్రభుత్వానికి ముందుకు ఎలా అడుగులు వేయాలో నిర్ణయించుకోవడం జరుగనుంది.
మీది బిచ్చపు బతుకు.. ఓట్లకోసం టోపీలు పెట్టుకుని ఇఫ్తార్ విందులకు వెళ్తారు..
ఇటీవల టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయాల్లో హీటు పెరిగింది. ముఖ్యంగా బండి సంజయ్కాం, గ్రెస్ పీసీసీ అధ్యక్షుల మధ్య మాటల ఘర్షణ మీడియా ఫోకస్‌లోకి వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల ఇచ్చిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల పరిపాటిపై తీవ్ర చర్చలను రేకెత్తిస్తున్నాయి. బండి సంజయ్ మాట్లాడుతూ.. మీది బిచ్చపు బతుకు. ఓట్ల కోసం టోపీలు పెట్టుకుని ఇఫ్తార్ విందులకు వెళ్తారు అని పీసీసీ అధ్యక్షుని పై విమర్శలు చేశారు. ఆయన జీవిత రాజకీయాలలో కనీసం వార్డ్ మెబర్ స్థాయి నుండి పోటీ చేసి గెలుస్తే, ఓటు చోరీ వంటి విషయాలు తెలిసేవని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ, హైదరాబాద్‌లో భారీగా కొకైన్ కలకలం
పోలీసులు ఎంత నిఘా పెట్టినా..డ్రగ్ పెడ్లరు మాత్రం తమ దందా ఆపడం లేదు. మత్తు పదార్థాలు తరలిస్తూనే ఉన్నారు. వినియోగదారులకు అందిస్తూనే ఉన్నారు. కానీ అప్పడప్పుడు..మాత్రం పోలీసులకు చేతికి చిక్కుతున్నారు. హైదరాబాద్ చాలా రోజుల తర్వాత భారీగా కొకైన్ పట్టుబడింది. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. అంతా ఎవరి బిజీలో వారు ఉన్నారు. భారీగా ట్రాఫిక్ రద్దీ… పండగ షాపింగ్స్‌తో జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. కానీ అక్కడే కొంత మంది తమ డ్రగ్స్ దందా నడిపిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు.. మిస్బహుద్దీన్ ఖాన్, అలి అస్గర్, జుబేర్ అలి, మహ్మద్ అజీమ్ ఒక ముఠాగా ఏర్పడ్డారు. వారందరికీ డ్రగ్స్ సేవించే అలవాటు ఉంది. ఐతే తాము తీసుకోవడంతో పాటు డ్రగ్స్ అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశ్యంతో బెంగళూరు వెళ్లారు. అక్కడ కొకైన్ కొనుగోలు చేసి తీసుకు వచ్చారు. హైదరాబాద్‌లో ఉన్న డ్రగ్ వినియోగదారులకు అందించేందుకు అంతా ప్లాన్ చేశారు. కానీ ఈ లోగానే వారిని పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 33.3 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 4 మొబైల్ ఫోన్స్, ఇన్నోవా క్రిస్టా కార్ సీజ్ చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో జుబేర్ అలీ అనే వ్యక్తి అమెరికా పౌరుడు.. 2 నెలల క్రితం హైదరాబాద్ వచ్చి.. డ్రగ్ పెడ్లర్లతో చేతులు కలిపాడు. డ్రగ్ రవాణా కోసం తన కారు ఉపయోగించాడు..
బీహార్ ఎన్నికల ముందే బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎంపిక.. కసరత్తు ప్రారంభం!
త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అయితే ఈలోపే బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. బీహార్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే కొత్త అధ్యక్షుడిని నియమించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు పూర్తికానున్నాయి. అనంతరం బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకాన్ని కూడా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.
అన్నామలైకు ఓ మంత్రి కుమారుడు షాక్.. స్టేజ్‌పై ఎంత పని చేశాడంటే..!
తమిళనాడులో ప్రస్తుతం నిరసన రాజకీయాలు నడుస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా అధికార పార్టీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. మొన్నటికి మొన్న ఓ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్నర్ రవి దగ్గర నుంచి డీఎంకే నేత భార్య జీన్ జోసెఫ్ డిగ్రీ పట్టా తీసుకునేందుకు నిరాకరించింది. వైస్ ఛాన్సలర్ దగ్గర తీసుకుని వెళ్లిపోయింది. గవర్నర్ తమిళ వ్యతిరేకి అని.. అందుకే పట్టా తీసుకోలేదని ఆమె తెలిపింది. తాజాగా బీజేపీ నేత అన్నామలైకు కూడా అదే మాదిరిగా చేదు అనుభవం ఎదురైంది. క్రీడా కార్యక్రమంలో పతకం మెడలో వేస్తుండగా ఓ మంత్రి కుమారుడు నిరాకరించాడు. ఈ పరిణామంతో ఒకింత అన్నామలై షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. పెరిగిన పసిడి ధరలు
గోల్డ్ లవర్స్‌కు మళీ షాక్ తగిలింది. పసడి ధరలు మళ్లీ హడలెత్తిస్తున్నాయి. భారత్‌పై ట్రంప్ విధించిన జరిమానా సుంకం బుధవారం నుంచి అమల్లోకి రానుంది. 50 శాతం సుంకం అమల్లోకి రానున్న నేపథ్యంలో మళ్లీ పుత్తిడి ధరలు పెరిగిపోయాయి. సిల్వర్ ధర మాత్రం ఉపశమనం కలిగించింది. ఈరోజు 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరగగా.. 22 క్యారెట్ బంగారం ధర రూ.500 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,02,060 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.93,550 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ బంగారం ధరర రూ. 410 పెరిగి.. రూ.76,550 దగ్గర ట్రేడ్ అవుతుంది.
అఫీషియల్.. ఆగస్టు 27న మాస్ జాతర రిలీజ్ వాయిదా
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భాను భోగవరపు అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మాస్ జతర’ చిత్రం ఆగస్టు 27వ తేదీన థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇటీవల పరిశ్రమ వ్యాప్తంగా జరిగిన సమ్మెలు మరియు కీలకమైన కంటెంట్ పూర్తి చేయడంలో ఊహించని జాప్యం కారణంగా సినిమాను అనుకున్న తేదీకి సకాలంలో షూటింగ్ ఫినిష్ చేయలేకపోయామని నిర్మాతలు అధికారికంగా తెలిపారు. కంగారుగా సినిమాని విడుదల చేయడం కంటే కాస్త సమయం తీసుకొని అత్యుత్తమ చిత్రంగా మలిచి, ప్రేక్షకులకు, రవితేజ అభిమానులకు గొప్ప అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. మాస్ జతార చిత్రాన్ని అసలైన పండుగ సినిమాగా తీర్చిదిద్దడానికి ప్రతి విభాగం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. కొత్త విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ, త్వరలోనే ప్రకటన వస్తుందని పేర్కొన్నారు. అభిమానులు నిరీక్షణకు బహుమానంగా త్వరలో ఆశ్చర్యకర కంటెంట్ రాబోతుందని నిర్మాత సితార నాగవంశీ అధికారకంగా ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ కు డిజాస్టర్ ఇచ్చిన సౌత్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన యంగ్ హీరో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాతాలో బిగ్గెస్ట్ డిజాస్టర్ వేసిన ఓ కోలీవుడ్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్. బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో కార్తీక్ ఆర్యన్ మంచి గేర్ మీదున్నాడు. భూల్ భూలయ్యా3 మాసివ్ హిట్టుతో కార్తీక్ రేంజ్ బీటౌన్‌లో పెరిగింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతున్నాడు. ఓ మూవీ కంప్లీట్ అయ్యింది అనుకునే లోపు మరోటి సెట్ చేస్తున్నాడు. అయితే స్పీడులో ర్యాంగ్ డైవర్షన్ వైపు టర్న్ తీసుకుంటున్నాడు. తన లైనప్‌లో ఓ ప్లాప్ మేకర్‌కు ఛాన్స్ ఇచ్చాడట. పంజాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు డిజాస్టర్ ఇచ్చిన కోలీవుడ్ డైరెక్టర్ విష్ణు వర్థన్‌తో ఓ జాంబి ఫిల్మ్ చేయబోతున్నాడట కార్తీక్.