అందెశ్రీ మృతిపై ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి.. తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచారు..
కవి, రచయిత అందెశ్రీ కన్నుమూయడంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. అందెశ్రీ మృతిపై సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. “ప్రముఖ కవి, రచయిత, తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందెశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించింది.. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ… అందెశ్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..” అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.. ‘ప్రముఖ తెలుగు సాహితీవేత్త, గేయ రచయిత అందెశ్రీ గారి మరణం బాధాకరం అని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యా్.. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.. ఆయన రచనా ప్రస్థానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొంటుంది. గొర్రెల కాపరిగా, భవన నిర్మాణ కూలీగా జీవితం మొదలుపెట్టి అక్షర యాత్ర చేశారు. తెలంగాణ జానపదాలపై, మాండలికంపై పట్టు కలిగిన రచయిత ఆయన.. పలు సినీ గీతాలు రచించారు. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు…’ గీతం వింటే సమాజాన్ని అందెశ్రీ ఎంతగా చదివారో అర్థమవుతుంది. ‘తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం” రచించి తెలంగాణ చరిత్రలో ఆయన చిరస్మరణీయంగా నిలిచారు. అందెశ్రీ గారి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు పవన్ కల్యాణ్..
పెట్టుబడులు రావడం.. రాష్ట్రం అభివృద్ధి చెందడం వైసీపీకీ ఇష్టం లేదు..!
ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావడం.. రాష్ట్రం అభివృద్ధి చెందడం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని ఆరోపించారు విశాఖ ఎంపీ శ్రీభరత్.. విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సుపై ఆయన మాట్లాడుతూ.. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.. పెట్టుబడుల సదస్సు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాము. సుమారు రూ.9.8 లక్షల కోట్లు విలువైన MoUs చేసుకునే అవకాశం ఉందన్నారు.. విశాఖలో ఐటీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది అని పేర్కొన్నారు. ఇక, విశాఖ సుందరీకరణపై స్పందించిన ఎంపీ.. “అవి షో కోసం కాకుండా, ప్రతి పైసా విలువైన విధంగా ఖర్చు అవ్వాలని చూస్తున్నాము” అన్నారు.
టీడీపీ మంత్రులతో లోకేష్ సమీక్ష.. కొత్త ఎమ్మెల్యేల వ్యవహారంపై కీలక సూచనలు..
కొత్త ఎమ్మెల్యేలపై మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు చేశారు.. కొత్తగా ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న నేపథ్యంలో.. ఉండవల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో, కేబినెట్ సమావేశానికి ముందు మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో లోకేష్ వ్యాఖ్యలు ప్రధానంగా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు మరియు వారి పనితీరు చుట్టూ సాగాయి. తొలిసారి గెలిచిన కొంతమందికి మంచిచెడులు తెలియట్లేదు.. అనుభవం లేకపోవడం వల్ల సమన్వయం లోపిస్తోంది అని లోకేష్ అభిప్రాయపడ్డారు. కొత్త ఎమ్మెల్యేలు సీనియర్‌ల అనుభవాన్ని నేర్చుకోవాలి.. సమస్యలను ఎలా అధిగమించాలో అవగాహన అవసరం అని సూచించారు.. కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించాలి.. లైన్‌లో పెట్టాల్సిన బాధ్యత మీదే అంటూ ఆదేశాలు జారీ చేశారట మంత్రి నారా లోకేష్.. ఇక, విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే సదస్సును కలిసికట్టుగా విజయవంతం చేద్దాం అని పిలుపునిచ్చారట లోకేష్.. సదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించిన ఆయన.. ప్రత్యక్ష, పరోక్షంగా లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలుగుతాయి అని పేర్కొన్నారు. మరోవైపు, ప్రతి మంత్రి తమ శాఖ పరిధిలో ఒప్పందాలకు సంబంధించి బాధ్యతతో వ్యవహరించాలి.. రేపు జరగబోయే MSME పార్కుల కార్యక్రమంలో మంత్రులంతా విధిగా పాల్గొనాలి. ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పన త్వరగా నెరవేర్చుదాం అని సూచించారు మంత్రి నారా లోకేష్..
మంత్రులకు సీఎం చంద్రబాబు అభినందనలు.. మీ కష్టం స్వయంగా చూశా..!
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో మంత్రులకు అభినందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మొంథా తుఫాన్ సమయంలో క్షేత్ర స్థాయిలో బాగా పనిచేశారని మంత్రులను ప్రత్యేకంగా అభినందించారు.. ప్రతి ఒక్కరూ క్షేత్ర స్థాయిలో ఉండి.. ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారని పేర్కొన్నారు.. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయడం వల్లనే తుఫాన్ సహాయక చర్యలు వేగంగా అందాయని తెలిపారు.. ఇక, ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ, టెక్నాలజీ సహాయంతో ప్రాణ, ఆస్థి నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగామని వెల్లడించారు.. మంత్రులు, అధికారులు, యంత్రాంగం టీం స్పిరిట్ తో పనిచేస్తే.. ఇటువంటి మంచి ఫలితాలే వస్తాయని అభినందనలు తెలిపారు.. మీరంతా ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా చూశానంటూ మంత్రులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, మొంథా తుఫాన్ రాష్ట్రంపై విరుచుకుపడినా.. ప్రభుత్వ ముందస్తు చర్యలతో భారీ ఆస్తి నష్టం కలగకుండా.. ప్రాణ నష్టం లేకుండా చూసిన విషయం విదితమే..
కొచ్చిలో అర్ధరాత్రి ప్రమాదం.. పగిలిన భారీ నీటి ట్యాంక్.. ఇళ్లు జలమయం
కేరళలోని కొచ్చి అకస్మాత్తుగా జలఖడ్గం విరుచుకుపడింది. తుఫాన్ కారణంగానో.. లేదంటే భారీ వరదలు కారణంగానో కాదు. ఊహించని రీతిలో అర్ధరాత్రి వచ్చిన పెను ముప్పు కారణంగా మొత్తం ఇళ్లను ముంచేశాయి. దీంతో వాహనాలు, వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణాపాయం తప్పినా.. భారీగా నష్టమైతే జరిగింది. ఆదివారం-సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయం. ప్రజలంతా మంచి గాఢ నిద్రలో ఉన్నారు. ఉన్నట్టుండి కొచ్చిలోని 1.35 లక్షల కోట్ల లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంక్ ఒక్కసారిగా పగిలిపోయింది. దీంతో ఒక్కసారి జలప్రవాహం ఇళ్లను ముంచెత్తింది. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు తేరుకునేలోపే ఇళ్లు మునిగిపోయాయి. వస్తువులు కొట్టుకుపోయాయి. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే అంతా జరిగిపోయింది. అందరూ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగిందని.. ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
రేపే మలి విడత పోలింగ్.. బూత్‌లకు చేరుకుంటున్న సిబ్బంది
బీహార్‌లో మంగళవారమే మలి విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పోలింగ్ సిబ్బంది కూడా బూత్ సెంటర్లకు చేరుకుంటున్నారు. తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చివరి విడత పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తొలి విడతలో రికార్డ్ స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడతలో కూడా అదే మాదిరిగా పోలింగ్ నమోదయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మొదటి విడతలో 121 స్థానాల్లో ఓటింగ్ జరగగా.. రెండో విడతలో 122 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.
2030 నాటికి 30 బిలియన్ల మార్కెట్‌కు అవకాశం..! డీప్ టెక్‌లో చైనాను భారత్ అధిగమిస్తుందా..?
భారతదేశం డీప్‌టెక్ రంగం గణనీయమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. రక్షణ ఆవిష్కరణలు, రోబోటిక్స్ విస్తరణ వంటి అంశాల కారణంగా 2030 నాటికి డీప్‌టెక్ మార్కెట్ విలువ 30 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకోనుందని రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ తాజా నివేదిక వెల్లడించింది. గత దశాబ్దంలో భారత రక్షణ బడ్జెట్ రెట్టింపు అయి USD 80 బిలియన్ దాటింది. దీంతో రక్షణ రంగంలో డీప్‌టెక్ వైపు భారీ పెట్టుబడులు మళ్లాయని నివేదిక చెబుతోంది. ఈ విస్తరణ అమెరికా, చైనా వంటి అగ్రదేశాల వృద్ధిరేటును కూడా అధిగమించింది. త ఐదేళ్లలో భారతదేశం యొక్క డీప్‌టెక్ అవకాశాలు 2.5 రెట్లు పెరిగాయి, 2030 నాటికి అది USD 30 బిలియన్ల మార్కెట్‌గా మారనుంది. చైనా వెలుపల విశ్వసనీయ, తక్కువ ఖర్చుతో కూడిన ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందుతోంది. 2025 నాటికి భారత డీప్‌టెక్ బేస్ విలువ USD 9–12 బిలియన్ ఉండవచ్చని అంచనా. రక్షణ, డీప్‌టెక్, గ్లోబల్ రోబోటిక్స్ రంగాల్లో వ్యయాలు ఈ వృద్ధికి దారితీస్తున్నాయి. ప్రపంచ రోబోటిక్స్ మార్కెట్ ప్రస్తుతం USD 60 బిలియన్, ఇది 2030 నాటికి USD 230 బిలియన్‌కి చేరవచ్చని నివేదిక అంచనా వేసింది. దీంట్లో భారత్ సుమారు USD 10 బిలియన్ అవకాశాన్ని పొందవచ్చని పేర్కొంది.
ట్రిపుల్ 50MP కెమెరా, 7300mAh బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్.. నవంబర్ 13న OnePlus 15 లాంచ్!
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’.. తన తదుపరి ఫ్లాగ్‌షిప్ ఫోన్ ‘వన్‌ప్లస్ 15’ను చైనాలో ఇప్పటికే లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 13కు కొనసాగింపుగా వన్‌ప్లస్ 15 వచ్చింది. మధ్యలో వన్‌ప్లస్ 14ను కంపెనీ స్కిప్ చేసింది. చైనాలో లాంచ్ అయిన 15.. ఇప్పుడు భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. నవంబర్ 13న రాత్రి 7 గంటలకు మన దగ్గర రిలీజ్ కానుంది. అదే రోజు రాత్రి రాత్రి 8 గంటలకు ఈ హ్యాండ్‌సెట్ అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ ఫ్లాగ్‌షిప్, శక్తివంతమైన మొబైల్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. వన్‌ప్లస్ అధికారిక పోర్టల్‌లో 15 ఫోన్ ఫీచర్లు వెల్లడయ్యాయి. వన్‌ప్లస్ 15 ఫోన్ 6.78 అంగుళాల ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ స్క్రీన్ 165Hz రిఫ్రెష్‌రేటుకు సపోర్ట్ చేస్తుంది. IP68 రేటింగ్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఔటాఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16తో ఇది పనిచేస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ను ఇందులో అమర్చారు. ఈ చిప్‌సెట్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మొబైల్ CPU అని చెప్పొచ్చు. వన్‌ప్లస్ 15లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ సోనీ IMX906 OIS మెయిన్ కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్స్, 50 ఎంపీ టెలిఫొటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 32 ఎంపీ సోనీ IMX709 సెన్సర్ ఉంటుంది. వన్‌ప్లస్ 15 ఫోన్ 7,300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 120W సూపర్ ఫ్లాష్ ఛార్జర్, 50W వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జ్‌తో వస్తుంది.
మీరు అనుకుంటే సరిపోద్దా.. హీరోలూ అనుకోవాలిగా!
నిన్న తమిళ సినీ నిర్మాతల మండలి (తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) చెన్నైలో ఉన్న కార్యాలయంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించింది. అంతేకాక, ఈ మీటింగ్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తమిళ సినీ పరిశ్రమను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు జనరల్ బాడీ తెలిపింది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వారు తీసుకున్న నిర్ణయాలు బానే ఉన్నాయి, కానీ వాటిని కేవలం నిర్మాతలు అనుకుంటే సరిపోదు, హీరోలు కూడా అనుకుంటేనే అది వర్కవుట్ అవుతుంది. ముఖ్యంగా, ఇక మీదట చేస్తున్న భారీ బడ్జెట్ సినిమాలన్నీ రెవెన్యూ షేరింగ్ మోడల్లోనే ఉండాలని ప్లాన్ చేశారు. అంటే, దీని ప్రకారం స్టార్ హీరోలు, టెక్నీషియన్లు ఫుల్ పేమెంట్లు తీసుకోరు, కానీ సినిమా పూర్తి అయిన తర్వాత వచ్చే లాభాన్ని లేదా నష్టాన్ని మాత్రమే షేర్ చేసుకుంటారు. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, శివ కార్తికేయన్, ధనుష్, విక్రం, శింబు, విశాల్ లాంటి హీరోలను ఈ కొత్త స్ట్రక్చర్కి సహకరించాలని కోరుతున్నారు. అలాగే, థియేటర్లో నుంచి వచ్చే రెవెన్యూ కూడా కాపాడేందుకు ఓటీటీ స్ట్రీమింగ్ విండోని పెంచాలని భావిస్తున్నారు.
మీరు అనుకుంటే సరిపోద్దా.. హీరోలూ అనుకోవాలిగా!
నిన్న తమిళ సినీ నిర్మాతల మండలి (తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) చెన్నైలో ఉన్న కార్యాలయంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించింది. అంతేకాక, ఈ మీటింగ్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తమిళ సినీ పరిశ్రమను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు జనరల్ బాడీ తెలిపింది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వారు తీసుకున్న నిర్ణయాలు బానే ఉన్నాయి, కానీ వాటిని కేవలం నిర్మాతలు అనుకుంటే సరిపోదు, హీరోలు కూడా అనుకుంటేనే అది వర్కవుట్ అవుతుంది. ముఖ్యంగా, ఇక మీదట చేస్తున్న భారీ బడ్జెట్ సినిమాలన్నీ రెవెన్యూ షేరింగ్ మోడల్లోనే ఉండాలని ప్లాన్ చేశారు. అంటే, దీని ప్రకారం స్టార్ హీరోలు, టెక్నీషియన్లు ఫుల్ పేమెంట్లు తీసుకోరు, కానీ సినిమా పూర్తి అయిన తర్వాత వచ్చే లాభాన్ని లేదా నష్టాన్ని మాత్రమే షేర్ చేసుకుంటారు. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, శివ కార్తికేయన్, ధనుష్, విక్రం, శింబు, విశాల్ లాంటి హీరోలను ఈ కొత్త స్ట్రక్చర్కి సహకరించాలని కోరుతున్నారు. అలాగే, థియేటర్లో నుంచి వచ్చే రెవెన్యూ కూడా కాపాడేందుకు ఓటీటీ స్ట్రీమింగ్ విండోని పెంచాలని భావిస్తున్నారు.
అఖండ 2 ఓవర్సీస్ రైట్స్ డీల్ వివరాలు. బాలయ్య కెరీర్ హయ్యెస్ట్
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. ఇప్పడు బాలయ్యతో అఖండకు సీక్వెల్ గా ‘అఖండ-2′ ను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. షూటింగ్ తో పాటు డబ్బింగ్ పనులను ముగించుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. తెలుగు స్టేట్స్ లో ఈ సినిమాను రికార్డ్ ధరకుడీల్ క్లోజ్ అయింది. తాజాగా అఖండ 2 ఓవర్సిస్ రైట్స్ ను మోక్ష మూవీస్ సినీ గ్యాలక్సీ మరియు శ్రీ వైష్ణవి ఎంటర్టైన్మెంట్స్ రూ. 15 కోట్లకు కొనుగోలు చేసారు. కేవలం నార్త్ అమెరికా వరకు 2.5 మిలియన్ డాలర్స్ కు డీల్ క్లోజ్ చేసారు. ఇక ఈ సినిమ డిజిటల్ రైట్స్ ను హాట్ స్టార్ అవుట్ రేట్ కు కొనుగోలు చేసింది. అన్ని లాంగ్వేజెస్ రైట్స్ ను రూ. 85 కోట్లకు అమ్ముడయ్యాయి. బాలయ్య సినిమాకు రావడం రికార్డ్ అనే చెప్పాలి. దానికి తోడు హింది తేయాట్రికల్ రైట్స్ కూడా ఉన్నాయి. ఏదేమైనా నిర్మాతలకు ఓటీటీ రూపంలో జాక్ పాట్ కొట్టినట్టే. ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న అఖండ 2 ను ఈ ఏడాది డిసెంబరు 5 న రిలీజ్ కానుంది/. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట-గోపీ అచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.