Off The Record: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు దాటుతోంది. కొన్ని నెలలుగా సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరితో పాటు కొంతమంది అధికారుల తీరు పై కూడా అసహనంగా వున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయనే చర్చ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోందట. సీఎం చంద్రబాబు గతంలో మంత్రులు, ఎంపీలతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎంపీలు కలిసి.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకోవాలి. అధికారులతో శాఖాపరంగా చర్చిస్తూ ఎప్పటికప్పుడు నిధులపై దృష్టి పెట్టాలి. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందని సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు అసలు కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదనే చర్చ కూటమిలో జరుగుతోందట. కోల్డ్‌వార్‌తో మాట్లాడుకోలేక, అటు నిధులను సంపాదించలేకపోతున్నారు. మంత్రుల తీరుతో అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే చర్చ బాగా జరుగుతోంది.
Read Also: Off The Record : మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ అనేక ప్రణాళికలు
ఎమ్మెల్యేలు, మంత్రుల సమన్వయలోపం ఎఫెక్ట్ నియోజకవర్గాల అభివృద్దిపైనా పడుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి. పలువురు ఎంపీలతో కూడా ఇదే పరిస్థితి. చాలా జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య కో-ఆర్డినేషన్ మచ్చుకైనా కానరావడం లేదని పార్టీలో డిస్కషన్ సాగుతోంది. ఇక జనసేన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి పతాకస్థాయికి చేరింది. మార్చి 31 లోపు ఉపయోగించు కోవాల్సిన నిధులు కేంద్రం దగ్గర నుంచి సగం కూడా తీసుకురాలేకపోయారని సీఎం ఫైరవుతున్నట్టు తెలుస్తోంది. నిర్లక్ష్యంగా వున్న వారి లిస్టు రెడీ అవుతోందని కూటమి నాయకులు చెబుతున్నారు.
