Rathnam: విశాల్ ‘రత్నం’ టీజర్ చూశారా.. ఈసారి రక్తపాతమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ్ మాస్ హీరో విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రత్నం’.. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి హరి దర్శకత్వం వహించారు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం, అలంకార్ ప్యాండన్ సహ నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సషన్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ చిత్రం టైటిల్‌తో పాటుగా, ఫస్ట్ షాట్ టీజర్‌ను విడుదల చేశారు.
ఈ ఫస్ట్ షాట్ టీజర్ ప్యూర్ గూస్ బంప్స్ స్టఫ్‌లా అనిపించింది. ఆ బ్యాక్ డ్రాప్, ఆ సెటప్, దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆర్ఆర్, కత్తితో తల నరికేయడం, విశాల్ మాస్ అవతారం ఇలా అన్నీ కలిసి ఈ ఫస్ట్ షాట్ టీజర్‌ను అద్భుతం అనేలా చేశాయి. ‘కన్నీరే నెత్తురు చిందగా.. క్రోదమే రుధిరం చిమ్మగా.. ఆగ్రహమే అరుణధారగా.. రణరంగమే రక్తపు ఏరుగా’ అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే మాటలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి..
Also Read
తలని నరికిన రక్తంతో టైటిల్ పేరు రావడం, ఆ రక్తమే రత్నం అనే టైటిల్‌గా మారడం మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. దీన్నిబట్టి ఈసారి విశాల్- హరి తమ సినిమాలో రక్తపాతాన్ని చూపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు వివేక్ పాటలు రాశారు. ఎం సుకుమార్ కెమెరామెన్‌గా పని చేశారు. ఈ చిత్రానికి టీ ఎస్ జయ్ ఎడిటర్. ఆర్ట్ డైరెక్టర్ పీ వీ బాలాజీ. కనల్ కన్నన్, పీటర్ హెయిన్, దిలిప్ సుబ్రయాన్, విక్కీ స్టంట్ మాస్టర్లుగా పని చేశారు.. ఇక ఈ సినిమాలో సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మేనన్, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్- సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. విశాల్‌కు ఇది 34వ చిత్రం. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశాల్ ఇటీవల ‘మార్క్ ఆంటోని’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు..
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!