తుపాను బాధితులను ఆదుకున్న బ్లాక్ రోజ్ బ్యూటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అందాల తార, బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా మరోసారి తన హృదయ విశాలతను చాటుకుంది. గత యేడాది కరోనా సమయంలో ఆన్ లైన్ లో ఫిట్ నెస్ కార్యక్రమాలను నిర్వహించి, తద్వారా వచ్చిన రూ. 5 కోట్లను కరోనా బాధితుల సహాయ నిధికి అందించింది ఊర్వశీ రౌతేలా. తాజాగా గోవా, మహారాష్ట్ర, కేరళను తౌక్టే తుపాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. దీనితో నిరాశ్రయులైన వారికి ఆహారాన్ని స్వయంగా అందించింది ఊర్వశీ రౌతేలా. సమాజంలోని అట్టడుగు వర్గాల వారి దగ్గరకు తానే వెళ్ళి ఆహార పోట్లాలను అందించింది. అంతే కాదు… ఆకలితో ఉన్న మూగజీవుల గురించి కూడా పట్టించుకుందీ సెక్సీ బ్యూటీ. ఇదిలా ఉంటే… ఊర్వశీ రౌతేలా ఈ యేడాది టాలీవుడ్ లోకి బ్లాక్ రోజ్ మూవీతో ఎంట్రీ ఇస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోస్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అందంతో పాటు తనకు చక్కని మనసుకూడా ఉందని నిరూపించుకున్న ఊర్వశీ రౌతేలాను నెటిజన్లు ఆకాశానికి ఎత్తుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!