తెలుగు చలన చిత్రసీమలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. ఇవాళ తెల్లవారు జామున హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. ఆదివారం రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు కృష్ణ.. చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు కృష్ణ. కార్డియాక్ అరెస్ట్ కారణంగా బ్రెయిన్‌తో పాటు కిడ్నీ, లంగ్స్ ఎఫెక్ట్ అయినట్టు డాక్టర్లు తెలిపారు. ఆయన వయసు 79 ఏళ్ళు