ఈ ఏడాది సంక్రాంతి మూవీస్ జనాలను అలరించాయి.. అంతేకాదు భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాయి.. అయితే ఇప్పుడు అందరు సమ్మెర్ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు.. ఈ సమ్మెర్ కు కూడా భారీగా సినిమాలు విడుదల అవుతున్నాయి.. గత ఏడాది సమ్మెర్ సినిమాలు నిరాశ పరిచాయ.. ఈ ఏడాది మాత్రం భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాలు ఎక్కువగా ఉన్నాయి.. ఏ సినిమా ఎప్పుడు విడుదల కాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
2024 వేసవిలో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ బెర్త్ ఖాయం చేసుకున్నారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా దేవర ఎప్రిల్ 5న విడుదల కానుంది. ఈ చిత్రంపై ఉన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పార్ట్ 1 మాత్రమే సమ్మర్‌లో రానుంది. దీని బిజినెస్ 200 కోట్లకు పైగానే జరుగుతుంది. మరోవైపు మే 9న కల్కితో రాబోతున్నారు ప్రభాస్.. ఈ సినిమా 500 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి..
అలాగే మార్చ్ 8న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో పాటు డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాయి. ఆ తర్వాత దేవర, కల్కి ఉన్నాయి.. తమిళం నుంచి విక్రమ్ తంగలాన్, విశాల్ రత్నం రానున్నాయి.. ఈ ఏడాది సమ్మర్ సినిమాలు జోరు ఎక్కువగానే ఉంది.. అంతా స్టార్ హీరోలే కావడం విశేషం.. తారక్, ప్రభాస్ తర్వాత ఆగస్ట్ 15న పుష్ప 2 రానుంది.. ఈ లోపు బడా సినిమాలు లేవనే చెప్పాలి.. మరి ఈ సమ్మర్ కు ఏ హీరో ఎంత కలెక్షన్స్ అందుకుంటాడో చూడాలి..