షారుఖ్ ఖాన్ కుమార్తెకు 21 యేళ్ళు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. శనివారం పుట్టిన రోజు జరుపుకున్న సుహానా తాజాగా ఆదివారం ఓ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతే… ఆమె స్నేహితులు, షారుఖ్ ఖాన్ అభిమానులు, చిత్రసీమలోని వివిధ శాఖలకు చెందిన వారూ సుహానాను అభినందనలతో ముంచెత్తడం ప్రారంభించారు. సుహానా తన లేటెస్ట్ ఫోటోను పోస్ట్ చేస్తూ కేవలం ‘ట్వంటీవన్’ అనే పదమే రాసింది. ఇక అంతే అనన్యాపాండేను మొదలు కొని జోయా అక్తర్, సీమా ఖాన్, భావనా పాండే, మహీప్ కపూర్ వరకూ అందరూ లవ్ ఎమోజీలతో సుహానాకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లి గౌరీ ఖాన్ సైతం సుహానా చిన్నప్పటి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పటికే రంగస్థలంపై సుహానా తన సత్తా చాటుతోంది. అయితే ఆమెకు వెండితెరపైనా నటిగా రాణించాలనే కోరిక ఉంది. ఆ విషయాన్ని స్వయంగా షారూఖ్ ఖానే చెప్పాడు కూడా. సో.. సుహానా అతి త్వరలోనే వెండితెరపై స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.
Also Read
- Tags
- 21st Birthday
- Suhana Khan
తాజావార్తలు
-
Ponnam Prabhakar : వర్షాకాలం.. బస్తీ దవాఖానలపై ప్రభుత్వం అలర్ట్
-
El Nino: ఎల్‌నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్‌ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
-
TMC: సొంత డబ్బులతో విమానం కొని, దానికే అద్దె చెల్లించారు.. తృణమూల్ స్కాంతో ఈడీ షాక్..
-
Viral Video : “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా”.. మనవడితో సీఎం రేవంత్ రెడ్డి మధుర క్షణాలు
-
Greece: గ్రీస్‌లో ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా దగ్ధమైన యుద్ధ విమానం
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!