సోదరులను ఫ్యాన్స్ కు పరిచయం చేసిన స్నేహ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటి స్నేహకు కేవలం తమిళంలోనే కాదు… తెలుగులోనూ కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. 2012 మే 12న ప్రముఖ నటుడు ప్రసన్నను పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా స్నేహ… ప్రాధాన్యమున్న పాత్రలు లభిస్తే సినిమాల్లో చేస్తోంది. విశేషం ఏమంటే స్నేహ, ప్రసన్న ఇద్దరూ కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీగానే ఉంటారు. ఇప్పటికే స్నేహకు ఒక బాబుతో పాటు, యేడాది పాప కూడా ఉంది. సోమవారం నేషనల్ బ్రదర్స్ డే సందర్భంగా స్నేహ తన కొడుకు, కూతురుకు సంబంధించిన రెండు ఫోటోలను పెట్టింది. నిజానికి అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. ఎందుకంటే… తరచూ వాళ్ళు వాళ్ళ పిల్లల ఫోటోలనూ సోషల్ మీడియాలో ఏదో సందర్భంలో పెడుతూనే ఉంటారు. అయితే స్నేహా తన పిల్లల ఫోటోలతో పాటు తన సోదరులు బాలాజీ, గోవింద్ లతో తానున్న ఫోటోలనూ సైతం పోస్ట్ చేసింది. ఆ రకంగా స్నేహ సోదరులు ఆమె ఫ్యాన్స్ కు పరిచయం అయినట్టయ్యింది. ‘నీ అవసరాలలో నీతో ఉండే వాడు, నువ్వు పడిపోతున్నప్పుడు పట్టుకునే వాడు, నీతో ఎవరూ లేనప్పుడు నిన్ను అంటిపెట్టుకుని ఉండే వాడే సోదరుడంటే. మనకు ఎప్పుడూ బెస్ట్ ఫ్రెండ్ బ్రదరే. హ్యాపీ బ్రదర్స్ డే’ అంటూ స్నేహ తన మనసులోని నాలుగు మాటలూ కూడా బయట పెట్టేసింది.
Also Read
తాజావార్తలు
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Queen 2:13 ఏళ్ల తర్వాత కంగనా సెన్సేషన్.. షూటింగ్ పూర్తి, రిలీజ్‌పై ఆసక్తి
-
Toxic : ‘టాక్సిక్’ లేడీస్ & లేడీస్ గ్లిమ్స్ రిలీజ్.. ఈసారి మరింత వైల్డ్‌గా యశ్
-
YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
-
KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
ట్రెండింగ్
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!