భలే భానుచందర్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం కేరెక్టర్ రోల్స్ లో కనిపిస్తోన్న భానుచందర్ ఒకప్పుడు కరాటే ఫైట్స్ తో కదం తొక్కారు. కొన్ని చిత్రాలలో హీరోగానూ అలరించారు. భానుచందర్ పూర్తి పేరు మద్దూరి వేంకటత్స సుబ్రహ్మణ్యేశ్వర భానుచందర్ ప్రసాద. ఆయన తండ్రి తెలుగులో విశేషమైన పేరు సంపాదించిన సంగీత దర్శకులు మాస్టర్ వేణు. తండ్రిలాగే ఆరంభంలో భానుచందర్ సైతం సరిగమలతో సావాసం చేశారు. పదనిసలో పయనం సాగించాలనీ ప్రయత్నించారు. గిటారిస్ట్ గా పేరు సంపాదించారు. ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులు నౌషాద్ వద్ద కొంతకాలం శిష్యరికం కూడా చేశారు. తరువాత భానుచందర్ అనుకో్కుండా డ్రగ్స్ కు బానిసయ్యారు. దాని నుండి కోలుకోవడానికి అన్నట్టు నటనను ఆశ్రయించారు. నటనలో అడుగుపెట్టడం వల్ల పూర్తిగా నయమై, నటునిగా అలరించడం మొదలు పెట్టారు. బాపు ‘మనవూరి పాండవులు’లో ఐదుగురు పాండవుల్లో ఒకరిగా నటించిన భానుచందర్ తరువాత అనేక పాత్రలను పోషించారు. కొన్ని చిత్రాలలో విలన్ గానూ నటించారు. యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరికీ భానుచందర్ తండ్రి మాస్టర్ వేణు మంచి మిత్రులు. దాంతో వారిద్దరూ నటించిన ‘సత్యం-శివం’ చిత్రంలో విజయశాంతి ప్రేమికుని పాత్రలో భానుచందర్ ను నటింపచేశారు. భానుచందర్ ఫైట్స్ చూసిన తమ్మారెడ్డి భరద్వాజ తమ ‘ఇద్దరు కిలాడీలు’లో ఓ హీరోగా తీసుకున్నారు. అదే చిత్రంలో సుమన్ మరో హీరోగా నటించారు. తరువాతి రోజుల్లో భానుచందర్, సుమన్ కొన్ని చిత్రాలలో కలసి నటించి అలరించారు. భానుచందర్ సోలో హీరోగా రూపొందిన “టెర్రర్, భలేమిత్రులు, నిరీక్షణ, అలజడి, ఉదయం, లాయర్ సుహాసిని” వంటి చిత్రాలు అలరించాయి. తరువాత కొన్ని చిత్రాలకు నిర్మాతగా, సంగీత దర్శకునిగానూ వ్యవహరించారు. అవేవీ అంతగా కలసి రాలేదు. దాంతో కేరెక్టర్ యాక్టర్ గా మారిపోయారు. అప్పటి నుంచీ గుణచిత్ర నటునిగా తనదైన బాణీ పలికిస్తున్నారు.
(మే 31న భానుచందర్ బర్త్ డే)
Also Read
తాజావార్తలు
-
Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
-
Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
-
Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
-
Flipkart Big Billion Days Sale 2026: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరోజు నుంచే.. స్మార్ట్ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?