‘ది ఫ్యామిలీ మ్యాన్’ లో ఎవరెవరి రెమ్యూనరేషన్ ఎంతెంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 ను మించి సీజన్ 2 సక్సెస్ సాధించింది. వివాదాలు చెలరేగడమే దీనికి కారణమని కొందరు అంటున్నా… బలమైన కంటెంట్, దానికి తోడు సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఇందులో నటించడం ఈ సీరిస్ సక్సెస్ కు కారణం. అయితే… ఈ సీరిస్ పై వీక్షకులకు ఏర్పడిన అంచనాలను అందుకోవడానికి రాజ్ అండ్ డీకే టీమ్ కృషి కూడా ఎంతో ఉంది. అయితే… ఇందులో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్స్ విషయమై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ వివరాలలోకి వెళితే… రెండు సీరిస్ లలో శ్రీకాంత్ తివారిగా నటించిన మనోజ్ బాజ్ పాయ్ కు 10 కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తోంది. అలానే అతని భార్య సుచిగా నటించిన ప్రముఖ నటి ప్రియమణికి ఒక్కో సీరిస్ కు 80 లక్షలు పే చేశారట. ఇక సీజన్ 2తో తమిళ తీవ్రవాది రాజీ పాత్రకు ప్రాణం పోసి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న సమంతకు మూడు నుండి నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మనోజ్ బాజ్ పాయ్ కుమర్తె గా ఆశ్లేషా ఠాకూర్ నటించింది. తొలి సీరిస్ లో ఆమె పాత్రకు పెద్దంత ప్రాముఖ్యం లేకపోయినా… రెండో సీజన్ లో ఆమెది కీలకమైన పాత్ర. ఆమెకు యాభై లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఇక ఇతర ప్రధాన పాత్రధారులలో షరీఫ్ హష్మీకి 65 లక్షలు, దర్శన్ కుమార్ కు కోటి రూపాయలు, శరత్ ఖేల్కర్ కు 1.6 కోట్లు, సన్నీ హిందూజాకు 60 లక్షలు ఇచ్చారన్నది ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట.
Also Read
తాజావార్తలు
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
-
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!