జానియర్ ఎన్టీఆర్, రామచరణ్‌లతో కలిసి నటిస్తున్నచిత్రం RRR. ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. కాగా ఈ చిత్రంపై అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటిస్తున్నారు. ప్రధాన పాత్రల్లో అజయ్ దేవగన్, శ్రీయశరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలయినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడేప్పుడా అని ఈ సినిమాకోసం ఎదురు చూస్తునే ఉన్నారు. రాజమౌళి మేకింగ్ కావడంతో సినిమాపై కావాల్సినంత బజ్ ఏర్పడింది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రీలీజ్ అయినా మూడు పాటలు ఆకట్టుకుంటున్నాయి. నాటు నాటు పాట అయితే మాస్ ఆడియోన్స్‌ను ఉర్రూతలు ఊగిస్తుంది. ఈ సారి వెండితెరపై జక్కన ఏం మాయ చేస్తాడో అని అందరూ వెయింటింగ్ చేస్తున్నారు. తాజాగా నిన్న ఈ మూవీ ట్రయిలర్‌ను విడుదలయింది. కాగా ప్రస్తుతం యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తుంది. కేవలం 7 గంటల్లోనే టాలీవుడ్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ ట్రయిలర్‌గా ఆల్‌టైమ్ రికార్డును సాధించింది. ఇప్పుడు 20 మిలియన్ వ్యూస్‌కి దగ్గరగా ట్రయిలర్ దూసుకెళ్తుంది. దీంతో చరణ్- ఎన్టీఆర్ అభిమానులు పుల్ ఖుషీగా ఉన్నారు. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయనున్నారు.