మరొక్క సినిమా… ఆ తరువాత రిటైర్మెంట్ అంటోన్న… టాప్ డైరెక్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్వెంటిన్ టారంటినో… హాలీవుడ్ చిత్రాలు రెగ్యులర్ గా చూసే వారికి ఈయనెవరో తెలిసే ఉంటుంది. ‘పల్ప్ ఫిక్షన్, కిల్ బిల్, ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్’ లాంటి సూపర్ హిట్స్ ఆయనవే! టారంటినో చిత్రాలు కథ, కథనం విషయంలోనే కాదు టైటిల్స్ కు సంబంధించి కూడా సరికొత్తగా ఉంటూ ఉంటాయి. అందుకే, ఆయన్ని ఇష్టపడే ప్రేక్షకులు అతడి నెక్ట్స్ మూవీ టైటిల్ ఏంటా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక ఈ ఆస్కార్ నామినేటెడ్ డైరెక్టర్ బాక్సాఫీస్ పైకి సంధించిన ఏ సినిమా చూడటం మొదలు పెట్టినా అమాంతం మనం అభిమానించటం మొదులు పెట్టేస్తాం. అంతటి మెస్మరైజింగ్ షో మ్యాన్ టారంటినో!
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించిన క్వెంటిన్ టారంటినో కొన్నాళ్ల క్రితం పెద్ద షాకిచ్చాడు. తన రిటైర్మెంట్ గురించి మాట్లాడి ఆశ్చర్యపరిచాడు. ఇప్పటి వరకూ తొమ్మిది చిత్రాలు డైరెక్ట్ చేసిన ఆయన పదో సినిమా తరువాత దర్శకత్వానికి గుడ్ బై చెబుతానని తాజాగా మళ్లీ ప్రకటించాడు. ఫ్యాన్స్ ని డిజపాయింట్ చేసేలా తన నిర్ణయంలో మార్పు లేదని కుండ బద్ధలు కొట్టాడు!
‘’హాలీవుడ్ డైరెక్టర్ గా నీ కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. వయస్సు కూడా మించిపోలేదు. రిటైర్మెంట్ ఎందుకు?’’ అంటోన్న వారికి, టారంటినో, ‘’పీక్స్ లో ఉన్నప్పుడే కదా రిటైర్ అవ్వాలి!’’ అంటూ సమాధానం ఇస్తున్నాడు. 30 ఏళ్లుగా ఫిల్మ్ మేకింగ్ కి తాను తన సర్వస్వం ఇచ్చేశాననీ… ఇక మీద పెద్దగా ఇచ్చేదేమీ ఉండదని చెబుతున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్. అందుకే, మరో సినిమా మాత్రం తీసి అస్త్ర సన్యాసం చేస్తానని రెండో ఆలోచన లేకుండా ప్రకటించేశాడు!
టారంటినో తొమ్మిదో చిత్రం ‘వన్స్ అప్ ఆన్ ఏ టైం ఇన్ హాలీవుడ్’. దానికి కొనసాగింపుగా అదే పేరుతో నవలని కూడా రచించాడు. ‘వన్స్ అప్ ఆన్ ఏ టైం ఇన్ హాలీవుడ్’ నావల్ ప్రమోషన్ లో భాగంగా తన రిటైర్మెంట్ పై మరోమారు స్పందించాడు. చూడాలి మరి, తన కెరీర్ లో చివరి చిత్రం అంటోన్న టెన్త్ మూవీని టారంటినో ఎలా తీస్తాడో!

Also Read
తాజావార్తలు
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!