న్యాచురల్ స్టార్ నాని చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఓ యూనిక్ కాన్సెప్ట్‌తో ‘శ్యామ్‌సింగ రాయ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత చిత్రాలకు భిన్నమైన సరికొత్త గెటప్స్‌లలో నేచురల్ స్టార్ నాని కనిపించనున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని రాజీ పడకుండా నిర్మాత వెంకట్ బోయనపల్లి రూపొందిస్తున్నారు. జీస్సూసేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల… కోల్‌కతాను తలపించే భారీ సెట్ రీ క్రియేట్ చేశారు. ఆరున్నర కోట్ల భారీ బడ్జెట్‌తో పది ఎకరాల్లో నిర్మించిన ఈ భారీ సెట్‌లో ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. కానీ లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగులు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ‘శ్యామ్ సింగ రాయ్’ సెట్ అంతా నాశనం అయ్యిందని, ఈ సెట్ ను మళ్ళీ పునర్నిర్మించడానికి మరో రెండు కోట్ల రూపాయల దాకా ఖర్చయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలీదు కానీ… అదే నిజమైతే మాత్రం ఇఇ నిర్మాతలకు భారీ నష్టం అనే చెప్పాలి.