బొంత రాము హీరోగా నటిస్తున్న సినిమా “మిస్టర్ రాము”. ఈ చిత్రంలో అజయ్ ఘోష్ విలన్ గా నటిస్తున్నారు. జబర్దస్త్ అప్పారావు మరో కీ రోల్ పోషించారు. ఈ చిత్రాన్ని రేణుక దేవి ఫిలింస్ బ్యానర్ పై బొంత రాము నిర్మించారు. అజయ్ కౌండిన్య దర్శకత్వం వహించారు. త్వరలో “మిస్టర్ రాము” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్, హీరో బొంత రాము మాట్లాడుతూ – నాకు హీరోగా నటించాలని కల ఉండేది. దర్శకుడు అజయ్ కౌండిన్య నాకు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు కథ నచ్చి తప్పకుండా చేద్దామని ముందుకు వచ్చాను. ఈ చిత్రంలో ఆటో డ్రైవర్ రోల్ లో నటించాను. మిస్టర్ రాము తో పాటు నేను, డైరెక్టర్ అజయ్ కౌండిన్య కాంబినేషన్ లో మరో 9 చిత్రాలు చేయబోతున్నాం. మొత్తం మా కాంబినేషన్ లో 10 సినిమాలు రాబోతున్నాయి. మిస్టర్ రాము సినిమా రిలీజైన వెంటనే మా కొత్త సినిమాను ప్రకటిస్తాం. మాకు సపోర్ట్ చేస్తున్న నా స్నేహితులు, సన్నిహితులు అందరికీ థాంక్స్. అన్నారు.