యువన్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై గణేష్ అగస్త్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కంచు కనకమాలక్ష్మి’.ఈ విజయదశమి రోజున సినిమా కి సంబంధించిన పూజ మరియు పాటల రికార్డింగ్ తో ప్రారంభం చేసింది చిత్ర యూనిట్. మల్లిక శంకర్ , కిషోర్ రావు, గౌతమ్ నంద, అమిత శ్రీ, హీరో హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు . అజయ్ పట్నాయక్ సంగీత సారధ్యంలో పాటల రికార్డింగ్ తో ప్రారంభం అయిన ఈ చిత్రానికి వీరేంద్రనాథ్ కోలుకుల, భరత్ అట్లూరి, బృందకర్ గౌడ్ ,రాజేష్ గంగునాయుని, గణపతి నాయుడు సీర, కొండల రావు చూక్కాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ “ఇకపై ఏడాదికి 3 సినిమా లు చెయ్యాలనే సంకల్పం తో మేము అనగా వీరేంద్రనాథ్ కోలుకుల, భరత్ అట్లూరి, బృందకర్ గౌడ్ ,రాజేష్ గంగునాయుని, గణపతి నాయుడు సీర, కొండల రావు చూక్కాల అందరం కలిసి ఒక సిండికేట్ గా ప్రయాణం స్టార్ట్ చేసాం, మొదటి చిత్రం గా కంచు కనకమాలక్ష్మి తర్వాతి చిత్రం బోయ్ బెస్టీస్ చేస్తున్నాము. ఈ బాయ్ బెస్టీస్ కి రుద్ర అనే కొత్త దర్శకుడి ని పరిచయం చేస్తున్నాను” అని తెలిపారు. ఈ విజయదశమి నాడు అజయ్ పట్నాయక్ సంగీత దర్శకత్వంలో పాటల రికార్డింగ్ తో మొదలుపెట్టాము. ఈ నెల 10 నుంచి షూటింగ్ కి వెళ్ళబోతున్నాము. విజయనగరం, పట్టిసీమ, అరకు పరిసర ప్రాంతాల్లో 28 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేసాము.. తరువాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నామని చెప్పారు.